Mahesh Babu: ఆ విషయంలో సూపర్ స్టార్ అప్సెట్ అయ్యారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట వచ్చే ఏడాది ఏప్రిల్ కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైందని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని నిర్మాతలు భావిస్తున్నారని బోగట్టా. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుండగా

ఒక సీన్ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అప్సెట్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన సర్కారు వారి పాట టీజర్, పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు మొదట అనుకున్న క్లైమాక్స్ విషయంలో మహేష్ కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారని ఈ సినిమా క్లైమాక్స్ మారుతోందని సమాచారం. కొన్నిరోజుల క్రితం సర్జరీ చేయించుకున్న మహేష్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

దర్శకుడు పరశురామ్ రైటర్స్ తో కలిసి క్లైమాక్స్ పై వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. గీతా గోవిందం సక్సెస్ తర్వాత పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. సర్కారు వారి పాట సక్సెస్ సాధిస్తే పరశురామ్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరే ఛాన్స్ ఉంటుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇతర భాషల్లో కూడా డబ్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది. మహేష్ తర్వాత సినిమాలకు త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్టర్లుగా ఉన్నారు. హ్యాట్రిక్ విజయాలను సాధించిన మహేష్ భవిష్యత్తు ప్రాజెక్టులతో కూడా హ్యాట్రిక్ సాధిస్తానని నమ్ముతున్నారు. రాజమౌళి మహేష్ కాంబో మూవీ కొరకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus