Sarkaru Vaari Paata Release Date: మహేష్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘సర్కారు వారి పాట’. నిజానికి ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం సినిమాను వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ న కూడా రావడం లేదని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడంతో భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయి.

మార్చి 25న ‘ఆర్ఆర్ఆర్’ వస్తుండడంతో ‘సర్కారు వారి పాట’ వెనక్కి వెళ్లింది. వేసవి కానుకగా మే 12న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ లో మహేష్ కూల్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నారు. ఈ పాట చాలా స్పెషల్ గా ఉంటుందని చెబుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మెలోడీ సాంగ్ అఫ్ ది ఇయర్‌ గా ఈ పాట నిలిచిపోతుందని చెబుతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus