Sarkaru Vaari Paata OTT: ‘సర్కారు వారి పాట’ ఫ్రీ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే?

ఓటీటీ రిలీజ్‌ డేట్‌.. ఓటీటీ ఫ్రీ రిలీజ్‌ డేట్‌ అని ఇకపై రెండింటి గురించి మనం వింటాం. అవును, మీరు చదివింది కరెక్టే. టాలీవుడ్‌ నిర్మాతలు, ఓటీటీ సంస్థల కొత్త విధానంతో ప్రేక్షకులకు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. ఇటీవల ‘ఆర్‌ఆర్ఆర్‌’ టీమ్‌ ఈ స్టైల్‌లో ట్రై చేద్దామని చూసినా.. వెనక్కి తగ్గారు. కానీ తెలుగువాళ్లు భుజానేసుకొని మోసిన ‘కేజీయఫ్‌ 2’కి మాత్రం అలాంటి రిలీజ్‌ చేశారు. అదేనండీ రెంటల్‌ రిలీజ్‌. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా అదే పని చేస్తోంది.

థియేటర్లలో సినిమా ఉండగనే రెంటల్‌ రిలీజ్‌ ఎందుకు చేశారు అనే విషయం పక్కన పెడితే.. ఉచితంగా (సబ్‌ స్క్రిప్షన్‌ ఉంటేనే) చూసే డేట్‌ను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ అనౌన్స్‌ చేసింది. ‘సర్కారు వారి పాట’ను సినిమాను జూన్‌ 23 నుండి ఉచిత్రంగా వీక్షించొచ్చు అని బ్యానర్స్‌ ప్రైమ్‌ వీడియో యాప్‌లో కనిపిస్తున్నాయి. అంటే మూడు వారాల పాటు సినిమాకు డబ్బులు చెల్లించి ఓటీటీలో చూడాలి. ఆ తర్వాత ఫ్రీగా చూడొచ్చన్నమాట.

ఇక్కడో విషయం ఏంటంటే.. ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదలైన మూడు వారాల తర్వాత ఓటీటీలోకి రెంటల్‌ రిలీజ్‌ చేశారు. మళ్లీ మూడు వారాలకే ఉచిత రిలీజ్‌ చేస్తున్నారు. కనీసం రెండొందల రూపాయలు టికెట్‌ రేటు ఉంటేనే థియేటర్‌లో సినిమా వేస్తాం అని నిర్మాతలు చెప్పకనే చెబుతున్నట్లు ఉంది. మరి మూడు వారాలు థియేటర్‌లో సినిమా చూసి, ఇప్పుడు మళ్లీ డబ్బులిచ్చి ఓటీటీలో చూస్తారా అనేది చూడాలి.

మహేష్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. బ్యాంకింగ్‌ మోసాలు, ఎగవేతల నేపథ్యంలో పరశురామ్‌ ఈ సినిమనాఉ తెరకెక్కించారు. విడుదలైన తొలి రోజుల్లో సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చింది. అయితే సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయని చిత్రబృందం చెబుతోంది. రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసినట్లు ‘సర్కారు వారి పాట’ పోస్టర్లు బయటకు వచ్చాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus