Keerthy Suresh: ‘సర్కారు వారి’ టీం ను అప్సెట్ చేసిన కీర్తి సురేష్..!

ఈ మధ్యనే ‘గాంధారి’ అనే మ్యూజిక్‌ వీడియో విడుదలైంది. కీర్తి సురేష్ ఈ వీడియోలో నర్తించడం జరిగింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు ఎక్కువగా ఇలాంటి మ్యూజిక్ వీడియోల్లో నర్తించడం కామన్ అయిపోయింది. అయితే దాదాపు హీరోయిన్లు చేసిన అన్ని మ్యూజిక్ వీడియోలకి మంచి స్పందన లభించింది. అయితే కీర్తి సురేష్ ‘గాంధారి’ వీడియో మాత్రం నిరాశపరిచింది. ఈ వీడియో పై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Click Here To Watch

‘ఇలాంటి చెత్త మ్యూజిక్‌ వీడియోలో కీర్తి ఎలా నటించిందంటూ’ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందులో ఏమాత్రం నేచురాలిటీ లేదని, చాలా ఫ్లాట్ గా ఉండనే కామెంట్స్ మరింత పెరుగుతున్నాయి.కీర్తి కాస్ట్యూమ్‌, వీడియో విజువల్స్‌ పై కూడా సెటైర్లు పడుతుండగా… మరోపక్క కాపీ ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ట్రోలింగ్ కు కీర్తితో పాటు ‘సర్కారు వారి పాట’ టీం కూడా హర్ట్ అవుతుంది. ముందు నుండీ ‘సర్కారు వారి పాట’ లో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడం మహేష్ అభిమానులకి ఇష్టం లేదు.

మహేష్ సరసన ఆమె సెట్ అవ్వదని మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా సరే టీం ఇవేవి పట్టించుకోకుండా ఆమెని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక కీర్తి సురేష్ నటించిన సినిమాలన్నీ రిలీజ్ అవ్వడం, అవన్నీ ప్లాపులు అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ మరింత టెన్షన్ పడుతున్నాడు. ‘సర్కారు వారి పాట’ రిజల్ట్ ఎలా ఉంటుందో అని వాళ్ళు కంగారు పడుతున్నారు. దానికి తోడు ‘గాంధారి’ మ్యూజిక్ వీడియో కూడా వారి టెన్షన్ ను మరింత పెంచుతుందని చెప్పాలి.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus