Sathyam Sundaram Teaser Review: ‘దేవర’ ముందు నిలబడే సినిమానా ఇది.. టీజర్ ఎలా ఉందంటే?
- September 13, 2024 / 08:01 PM ISTByFilmy Focus
కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు కార్తీ (Karthi). అతని ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. కొన్నిసార్లు ఊహించని విధంగా అవి సూపర్ హిట్లు కూడా అవుతుంటాయి. ‘ఖైదీ’ (Kaithi) ‘సర్దార్’ (Sardar) వంటి సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత (Samantha) – శర్వానంద్ (Sharwanand) ..లతో ‘జాను’ (Jaanu) (’96’ రీమేక్) ను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.
Sathyam Sundaram Teaser

కొద్దిసేపటి క్రితం టీజర్ వదిలారు. ‘సత్యం సుందరం’ టీజర్ విషయానికి వస్తే… ఇది 1 :34 నిమిషాల నిడివి కలిగి ఉంది. టీజర్ మొత్తం కార్తీ, అరవింద్ స్వామి (Arvind Swamy)..మాత్రమే ఉన్నారు. బావా బావా అంటూ కార్తీ.. అరవింద్ స్వామిని పిలవడం.. అందుకు అరవింద్ స్వామి ఇష్టం లేకుండా, ఇబ్బంది పడుతూ పలకడం వంటివి చూపించారు. అరవింద్ స్వామి పాత్రకి నచ్చనివన్నీ చేసి ఆటపట్టించే బావమరిదిగా కార్తీ కనిపిస్తున్నాడు. ఒక రాత్రి జరిగే కథ ఇదేమో అనే డౌట్ కలుగుతుంది.

’96’ దర్శకుడు కాబట్టి… ఆ సినిమా కూడా నైట్ బ్యాక్ డ్రాప్లోనే ఎక్కువ భాగం సాగుతుంది కాబట్టి, ఈ ‘సత్యం సుందరం’ కథ కూడా అలాంటిదేనేమో అనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఏదేమైనా టీజర్లో కార్తీ, అరవింద్ స్వామి..ల బ్రోమాన్స్ అయితే హైలెట్ అని చెప్పాలి. సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదల కాబోతుంది. దానికి ఒక రోజు ముందు ‘దేవర’ (Devara) కూడా వస్తుంది. మరి ఆ పాన్ ఇండియా సినిమా ముందు కార్తీ సినిమా నిలబడుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.












