‘రాజావారు రాణి గారు’, ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ వంటి విజయవంతమైన చిత్రాలతో యువతకి చేరువైన కిరణ్ ఆబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘సెబాస్టియన్ PC 524′. రేచీకటి తో బాధపడే పోలీస్ ఆఫీసర్ గా హీరో కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.’ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్’ సమర్పణలో ‘జ్యోవిత సినిమాస్’ బ్యానర్ పై బి . సిద్దారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది.
జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.బాలాజీ సయ్యపురెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ ఎంత వరకు జరిగిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 2.00 cr |
సీడెడ్ | 1.40 cr |
ఉత్తరాంధ్ర | 1.50 cr |
ఈస్ట్ | 0.30 cr |
వెస్ట్ | 0.20 cr |
గుంటూరు | 0.35 cr |
కృష్ణా | 0.25 cr |
నెల్లూరు | 0.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.20 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.25 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 6.45 cr |
‘సెబాస్టియన్ PC 524’ చిత్రానికి రూ.6.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కిరణ్ గత చిత్రం ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ రూ.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. అయితే అప్పుడు ఆ సినిమాకి సోలో రిలీజ్ దక్కింది. పైగా పాటలు కూడా సినిమా పై అంచనాల్ని పెంచాయి. ఈసారైతే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాలు పోటీగా ఉన్నాయి. ఈ పోటీని తట్టుకుని అంత పెద్ద టార్గెట్ రీచ్ అవ్వడం చాలా కష్టమనే చెప్పాలి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప చిన్న సినిమాల్ని జనాలు పట్టించుకోవడం లేదు.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!