Sehari Release Date: రవితేజ సినిమాకి పోటీగా కొత్త హీరో సినిమా…!

  • January 31, 2022 / 12:54 PM IST

హర్ష్‌ కనుమిల్లి హీరోగా పరిచయమవుతూ చేస్తున్న చిత్రం ‘సెహరి’. సిమ్రాన్‌ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానసాగర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రం ఓపెనింగ్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేసి టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరాలు అయ్యాయి. ‘వర్గో పిక్చర్స్‌’ పతాకం పై అద్వయ జిష్ణు రెడ్డి, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు ‘సెహరి’ టైటిల్ సాంగ్, ‘ఇది చాలా బాగుందిలే’ పాటలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా పై పాజిటివ్ బజ్ నెలకొంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ‘సెహరి’ ని ఫిబ్రవరి 11న విడుదల చేయబోడానికి దర్శకనిర్మాతలు రెడీ అయ్యారు. అయితే ఇక్కడో సమస్య ఉంది. అదేంటంటే… ఫిబ్రవరి 11కే రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ‘ఖిలాడి’ పెద్ద సినిమా కాబట్టి… ఆ సినిమాతో పోటీగా రావడానికి మరో చిత్ర బృందం సాహసించదు. అంతేకాకుండా అదే డేట్ కు ‘డిజె టిల్లు’ కూడా విడుదల కాబోతుందని టాక్ నడుస్తుంది. అయినప్పటికీ ‘సెహరి’ మేకర్స్ ఫిబ్రవరి 11 డేట్ కు రావాలని డిసైడ్ అయ్యారు. దీనిని బట్టి తమ సినిమా పై వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొదటి నుండీ ‘సెహరి’ కి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి… బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకే అవకాశాలు బలంగానే ఉన్నాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus