Sekhar Kammula: ధనుష్‌ – నాగార్జున – శేఖర్‌ కమ్ముల సినిమాకు సంగీత దర్శకుడు డీఎస్పీనా?

శేఖర్‌ కమ్ముల సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు ఆయన దూరంగా ఉంటారు. ఒకవేళ చేసినా అందులో ఏదో కొత్త పాయింట్‌ ఉంటుంది. అయితే అగ్ర హీరోలతో ఆయన సినిమాలు చేయడం చాలా అరుదు. అయితే ఇప్పుడు ఆయన ఇద్దరు అగ్రహీరోలు.. అందులోనూ రెండు ఇండస్ట్రీల నుండి వచ్చిన హీరోలతో చేస్తున్నారు. అందుకేనేమో తన రెగ్యులర్‌ స్టైల్‌ క్రూ ఎంపికలో కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు వచ్చింది అంటే..

ఈ సినిమా కోసం ఆయన ఎంపిక చేసుకున్న సంగీత దర్శకుడి గురించే. ధనుష్‌ – నాగార్జున కాంబోలో శేఖర్‌ కమ్ముల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్‌ను ఎంచుకున్నారని ఓ టాక్‌ నడుస్తోంది. అంటే తన పాత సినిమా ‘అనామిక’ తరహాలో ఈ సినిమాకు సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకున్నారు అంటున్నారు. ఆ సినిమాకు సీనియర్‌ సంగీత దర్శకుడు అయిన కీరవాణిని శేఖర్‌ కమ్ముల ఎంచుకున్న సంగతి తెలిసిందే.

నిజానికి శేఖర్‌ కమ్ముల సంగీత దర్శకుల విషయంలో పూర్తిగా కొత్త వాళ్లను, లైమ్‌ లైట్‌లో లేనివాళ్లను ఎంచుకుంటూ ఉంటారు. ‘ఆనంద్’, ‘గోదావరి’ సినిమాలకుకెఎమ్‌. రాధాకృష్ణ, ‘హ్యాపీ డేస్’, ‘లీడర్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలకు మిక్కీ జె మేయర్‌, ‘ఫిదా’ సినిమాకు ‘శక్తికాంత్‌ కార్తిక్‌’, ‘లవ్ స్టోరీ’ సినిమాకు పవన్ సిహెచ్ అలా వచ్చినవాళ్లే. అయితే ఇప్పుడు డీఎస్పీని ఎందుకు పిలుస్తున్నారు అంటే…

శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) చేయబోతున్న సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ అవుతుందట. ఇద్దరు అగ్ర హీరోలను పెట్టుకుని కొత్త వాళ్లను తీసుకుంటే ఆ సంగీతం బ్యాలెన్స్‌ అవ్వదేమో అనే డౌట్‌లో పడ్డారట. అందుకే దేవిని పిలుస్తున్నారు అంటున్నారు. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. ‘నా సామిరంగా’ సినిమా రిలీజ్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల సినిమా విషయంలో నాగ్‌ క్లారిటీ ఇస్తారు అని సమాచారం. ధనుష్‌ అయితే ఎప్పుడో రెడీ.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus