తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దివంగత నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా ఈయన హీరోగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ప్రజలకు ఎంతో అద్భుతమైన సేవలను అందించారు. ఇలా తెలుగు ప్రజల మదిలో చెరగని ముద్ర సంపాదించుకున్న ఎన్టీఆర్ గారికి అరుదైన గౌరవం లభించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ సేవలను గుర్తించి ఎన్నోచోట్ల ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. త్వరలోనే అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగనుందని తెలియడంతో ఎన్టీఆర్ కి దక్కినటువంటి ఈ అరుదైన గౌరవానికి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ చలనచిత్ర నిర్మాత, టీజీ విశ్వప్రసాద్ 2023 శతాబ్ది ఉత్సవాల సందర్భంలో భాగంగా న్యూ జెర్సీలోని ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇక ఈయన ఆలోచనలకు అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు మద్దతు కూడా తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈ ప్రతిపాదనను సమీక్షించిన అనంతరం ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ తరపున నిధులు సమకూరుస్తున్నారు. ఈ క్రమంలోనే 2023 శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించి తెలుగు సినిమా వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేస్తున్నారనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!