సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో 130కు పైగా సినిమాలలో నటించినా సీనియర్ నటి కవిత (Kavitha) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. సీరియస్ రోల్స్, ఎమోషనల్ రోల్స్ లో ఎక్కువగా నటించిన ఈ నటి కొన్ని టీవీ సీరియల్స్ లో సైతం నటించి తన నటనతో మెప్పించారు. 11 సంవత్సరాల వయస్సులోనే కవిత ఓ మంజు అనే తమిళ మూవీతో కెరీర్ ను మొదలుపెట్టారు. ఆ సినిమా సక్సెస్ సాధించడంతో తెలుగులో కూడా కవితకు ఆఫర్లు వచ్చాయి.
తెలుగులో చుట్టాలున్నారు జాగ్రత్త సినిమాలో హీరోయిన్ గా నటించిన కవిత ఈ సినిమా తర్వాత కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టీడీపీలో కొంతకాలం పాటు క్రియాశీలకంగా వ్యవహరించిన కవిత తర్వాత రోజుల్లో పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. తాజాగా ఒక సందర్భంలో కవిత మాట్లాడుతూ పర్సనల్ లైఫ్ కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించడం గమనార్హం.
నా భర్త పేరు దశరథరాజు అని ఆయన నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎదురుకట్నం ఇచ్చారని కవిత తెలిపారు. పెళ్లికి ముందే పిల్లల్ని కనడం నాకు ఇష్టం లేదని నా భర్తకు షరతులు విధించానని ఆమె చెప్పుకొచ్చారు. తమ్ముడు చనిపోవడం వల్ల నేను పిల్లలను వద్దనుకున్నా మా అత్తగారు మాత్రం పిల్లలు కావాలని అడిగేవారని కవిత వెల్లడించారు. కొన్ని నెలల తర్వాత నేను గర్భవతి అయ్యానని కవిత పేర్కొన్నారు.
నాకు ముగ్గురు సంతానం అని కూతురు పుట్టిన తర్వాత నా లైఫ్ సంతోషమయం అయిందని ఆమె చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో భర్త, కొడుకును కోల్పోయానంటూ కవిత పేర్కొన్నారు. కవిత ఎమోషనల్ అవుతూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నటి కవిత వయస్సు ప్రస్తుతం 58 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. కవిత కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.