క్యాస్టింగ్ కౌచ్ అనే టాపిక్ గురించి జనాలకు కొంచెం ఎక్కువ అవగాహనే ఉంది. 2018 లో మీటూ అంటూ ఈ ఉద్యమం దేశం మొత్తం షికార్లు కొట్టింది. బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్… ఎక్కడా తగ్గలేదు. టాలీవుడ్లో కూడా కొంతమంది నటీమణులు మీటూ అంటూ ఆరోపణలు చేసినప్పటికీ… వాళ్ళని వేధించిన సెలబ్రిటీలు ఎవరు అనే విషయాన్ని బయటపెట్టలేదు. ప్రతీ రంగంలోనూ ఇది కామనే కానీ నాకు అలాంటి అనుభవాలు ఎదురుపడలేదు అంటూ కవర్ చేసేశారు.
అనుష్క, రకుల్ వంటి బడా హీరోయిన్లు ఇలా కవర్ చేసిన వాళ్ళ లిస్ట్ లో ఉన్నారు. ఈ క్రమంలో మరికొంత మంది నటీమణులు … వాళ్ళంతా లొంగిపోవడం వలన వాళ్ళకి వేధింపులు ఎదురుకాలేదు అంటూ సెటైర్లు కూడా వేశారు.ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఇటీవల సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కూడా ఈ విషయం పై స్పందించింది. ఈమె కూడా అందరిలానే వేధింపులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నాయి అంటూ మొదలుపెట్టింది. అటు తర్వాత కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. వేధింపులు ఉన్నాయి అని తెలిసి వాటికి భయపడి పారిపోకూడదు. అలా అని వ్యక్తిత్వాన్ని చంపుకుని లోంగిపోకూడదు.
అమ్మాయిలు బయటకి వెళ్లేప్పుడు .. వెళ్ళే చోటు గురించి, అక్కడి మనుషుల స్వభావం గురించి తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి. అలా అయితే అమ్మాయిలకు వచ్చే ఇబ్బందులు ఉండవు. నా వరకు నేను అలాగే నడుచుకుంటూ వచ్చాను.అందుకే నాకు అలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదు అంటూ చెప్పుకొచ్చింది.