ఇప్పుడున్న పరిస్థితుల్లో కుర్ర హీరోల్లో పెద్ద హీరోలు ఎవరు అంటే ఎక్కువశాతం మంది ఠక్కున చెప్పేది మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. అయితే మార్కెట్ పరంగా ఎంత పెద్ద హీరోలు అయినా. ఈ హీరోలు మహా అయితే ఏడాదికి ఒకటి, లేదా రెండు సినిమాలు చేస్తున్నారు. అయితే సినీ విశ్లేషకుల వాదన ప్రకారం…ఈ బడా హీరోలు కుర్ర హీరోలు అయినటువంటి నారా రోహిత్, సాయి ధర్మ తేజ లను చూసి బుద్ది తెచ్చుకోవాలి అంటున్నారు. దానికి గల కారణాలు ఏంటి అంటే, ఈ కుర్ర హీరోలు దాదాపుగా ఏడాదిగి 3 నుంచి నాలుగు సినిమాలు చేసేస్తున్నారు అని, వీలైతే 5కూడా చేసేవారు అని తెలిపారు. అప్పట్లో ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు ఇలా ఏ రకంగా అయితే ఏడాదికి 6సినిమాల వరకూ చేసారో అలానే ఇప్పుడున్న యువ హీరోలు సినిమాలు చేస్తున్నారు అని. అందులో ముఖ్యంగా మన సాయి ధర్మ తేజనే తీసుకుంటే, సుప్రీం సినిమాలో షూటింగ్ లో ఉండగానే తిక్క అనే టైటిల్ తో ఒక మాస్ మాసాలాలో కూడా నటిస్తున్నాడు. ఇక అదే క్రమంలో తాజాగా..గోపించంద్ మలినేని దర్శకత్వంలో ‘విన్నర్’ ఆనే సినిమాలో కూడా నటిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇక నారా రోహిత్ విషయానికి వస్తే…దాదాపుగా 7 సినిమాల వరకు చేతిలో పెట్టుకుని దూసుకుపోతున్నాడు. ఇలా కుర్ర హీరోలు అందరూ ఒకేసారి 3నుంచి 4సినిమాలు చేస్తూ ఉంటే, మన పెద్ద హీరోలు మాత్రం ఏడాది ఒకటితో సరిపెట్టుకుంటున్నారు. అందుకే వీళ్ళని చూసి వాళ్ళు బుద్ది తెచ్చుకోవాలి అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.