చిరంజీవి పాటకు చిందేసిన సీరియల్ నటులు.. వైరల్ అవుతున్న వీడియో..

సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోయింది. నెటిజన్లతో తమ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలన్నిటినీ షేర్ చేసుకుంటూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌ని పెంచుకుంటున్నారు. ఈ విషయంలో సిల్వర్ స్క్రీన్ స్టార్లకి పోటీనిస్తున్నారు స్మాల్ స్క్రీన్ సెలబ్స్.. లేటెస్ట్ ఫోటోషూట్స్, రీల్స్, షూటింగ్ అప్‌డేట్స్‌తో హంగామా చేస్తున్నారు. తాజాాగా కొందరు టీవీ ఆర్టిస్టులు మెగాస్టార్ చిరంజీవి పాటకు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చిన్నా, పెద్ద నటీనటులంతా కలిసి ఉత్సాహంగా స్టెప్పులేసిన వీడియోను నటి త్రివేణి యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

చిరంజీవి రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ లోని ‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్’ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. మేల్ ఆర్టిస్టుల కంటే ఫీమేల్ ఆర్టిస్టులే డ్యాన్స్ ఇరగదీసేశారు. చక్కటి ఈజ్, గ్రేస్‌తో చేసిన మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. త్రివేణి పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus