మొన్నామధ్య ‘డాన్ 3’ సినిమాను బాలీవుడ్‌లో అనౌన్స్ చేసినప్పుడు జనాలందరూ ఒకటే గొడవ.. మాకు డాన్ (Don Movie) అంటే షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఒక్కడే.. వేరే హీరోను డాన్‌గా ఊహించుకోలేం అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. తిరిగి షారుఖ్‌నే ఆ పాత్ర కోసం తీసుకోవాలి అంటూ చిన్న సైజు ఉద్యమమే నడిపారు. అయితే ‘డాన్’ సినిమా తీసే సమయంలో జరిగిన ఓ విషయం తెలిస్తే ఇంత పంచాయితీనే ఉండదు.
Don Movie
బాలీవుడ్‌లో ‘డాన్’ అంటే ఇప్పటివరకు.. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , షారుఖ్ ఖాన్ మాత్రమే. నిజానికి అమితాబ్, హృతిక్ రోషన్ (Hrithik Roshan) పేర్లు వినిపించాల్సి ఉండేవి. రెండో ‘డాన్’ తీస్తున్నప్పుడు తొలుత ఆ పాత్ర కోసం హృతిక్ రోషన్‌ని అనుకున్నారట. ఈ విషయం గురించి ఆ సినిమా దర్శకుడు ఫరాన్ అక్తర్ చెప్పడంతో.. ఆ విషయాలు వైరల్‌గా మారాయి. ‘లక్ష్య’ సినిమాలో హృతిక్‌తో కలసి పనిచేసినప్పుడు ఆయన నటనకు ఫిదా అయిపోయాను. అదే సమయంలో నేను అమితాబ్ బచ్చన్ ‘డాన్’ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను.
దాంతో మొదటగా ఆ ఆలోచన హృతిక్ రోహన్‌తోనే చెప్పాను. వెంటనే ఆ ఆలోచన అద్భుతంగా ఉందని.. స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడు. కానీ కథను సిద్ధం చేస్తున్నప్పుడు.. ఈ పాత్రకు షారుఖ్ సరిగ్గా సరిపోతాడనిపించిందట. దాంతో ఆ విషయాన్ని హృతిక్‌కి చెబితే ‘డాన్’ పాత్రను షారుఖ్ మాత్రమే చేయగలడు అనిపిస్తే ఆయనతోనే తెరకెక్కించండి. నా గురించి ఆలోచించకండి అని అన్నాడట. అలా షారుఖ్‌తో ఆ సినిమా స్టార్ట్ అయిందని ఫరాన్ అక్తర్ చెప్పాడు.
దీంతో హృతిక్ ‘డాన్’ అయి ఉంటే ఎలా ఉండేది అనే చర్చ ఇప్పుడు బాలీవుడ్‌లో నడుస్తోంది. మరోవైపు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా ‘డాన్ 3’ని రూపొందించే పనిలో ఉన్నారు ఫరాన్ అక్తర్. షారుఖ్‌ని కాదని.. రణ్‌వీర్‌ని తీసుకోవడం సరికాదు అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు తొలి డాన్ షారుఖ్ కాదని తెలిశాక.. వాళ్లు కాస్త కామ్ అయ్యారు అంటున్నారు.