త్వరలో పట్టాలెక్కనున్న “3 ఇడియట్స్” సీక్వెల్!
- May 24, 2016 / 02:11 PM ISTByFilmy Focus
ప్రస్తుతం సంజయ్ దత్ జీవితం ఆధారంగా “సంజుబాబా” చిత్రాన్ని తెరకెక్కీంచ్ పనిలో యమ బిజీగా ఉన్న బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి, ఆ సినిమా తర్వాత “3 ఇడియట్స్”కు సీక్వెల్ ను తెరకెక్కించనున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం.
2009లో విడుదలైన “3 ఇడియట్స్” ఏకంగా 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి.. అమీర్ ఖాన్ కెరీర్ లోనే కాకుండా బాలీవుడ్ సినిమా చరిత్రలోనే సరికొత్త సంచలనాలను సృష్టించింది. అమీర్ ఖాన్, మాధవన్, శర్మాణ్ జోషి, కరీనా కపూర్ లు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం సీక్వెల్ ను కూడా వారితోనే తెరకెక్కీంచేందుకు రాజ్ కుమార్ సన్నాహాలు చేసుకొంటున్నాడు.
ఇప్పటికే ఈ సీక్వెల్ కోసం కొన్ని స్టోరీ లైన్లు ప్రిపేర్ చేసుకొన్న రాజ్ కుమార్.. సదరు స్టోరీ లైన్లను సినిమాటిక్ గా తీర్చిదిద్దమని తన అసిస్టెంట్లకు చెప్పాడట. ప్రస్తుతం వారు ఆ పనిలోనే ఉన్నారు!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














