శర్వానంద్ కి ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేదు. అయినప్పటికీ అతనిపై రూ.60 కోట్ల బడ్జెట్ పెట్టి ‘బైకర్’ అనే సినిమా నిర్మించారు ‘యూవీ క్రియేషన్స్’ వారు. ఈ బ్యానర్లో శర్వా చేసిన ‘రన్ రాజా రన్’ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘మహానుభావుడు’ వంటి సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. ఇక ‘జోహార్'(వెబ్ సిరీస్) ఫేమ్ అభిలాష్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. తాజాగా ‘బైకర్’ గ్లింప్స్ ను వదిలారు.
Biker Movie Glimpse
ఈ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇది 1:21 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘ఇక్కడ ప్రతి బైకర్ కి ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ, చావుకి ఎదురెళ్ళే కథ, ఏం జరిగినా పట్టువదలని మొండోళ్ళ కథ’ అంటూ హేమచంద్ర వాయిస్ ఓవర్లో గ్లింప్స్ మొదలైంది. శర్వానంద్ ఓ బైక్ రేసర్ గా కనిపిస్తున్నాడు. సినిమా కాన్సెప్ట్ అంతా బైక్ రేస్..ల చుట్టూనే తిరుగుతుంది అని టైటిల్ తోనే క్లారిటీ ఇచ్చారు. ఈ గ్లింప్స్ లో దానికి తగ్గ సెటప్ ఎలా ఉంటుంది అనేది చూపించారు.
బైక్ రేసులతో పాటు ఇందులో హైలెట్ గా అనిపించింది శర్వానంద్ లుక్. ఈ పాత్ర కోసం అతను బాగా సన్నబడిపోయాడు. అతని ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. అలాగే జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ‘గెలవడం గొప్ప కాదు.. చివరి దాకా పోరాడటం గొప్ప’ అనే డైలాగ్ ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్లింప్స్ చివర్లో అతన్ని కూడా చూపించారు.
డిసెంబర్ 6న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే డిసెంబర్ 5న ‘అఖండ 2’ రిలీజ్ కానుంది. అయినప్పటికీ ‘బైకర్’ ని డిసెంబర్ 6న దింపుతున్నారు అంటే.. చిన్న విషయం కాదు. ‘బైకర్’ కంటెంట్ కేవలం యూత్ ని మాత్రమే టార్గెట్ చేసినదిగా అనిపిస్తుంది. చూడాలి మరి.. ‘అఖండ 2’ పక్కన వచ్చి ఈ సినిమా ఎంత వరకు నిలబడుతుందో.