రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు పడుతుండగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనితో నదీ పరివాహక ప్రాంతాలు వరదలలో చిక్కుకుంటున్నాయి. కాగా హీరో శర్వానంద్ తాతగారి ఇల్లు వరదలకు కూలిపోయింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపాన గల ఎడ్ల లంకలో శర్వానంద్ తాతగారైన డాక్టర్ మైనేని హరి ప్రసాద్ ఉంటున్నారు. కృష్ణా నదికి వరద రావడంతో ఆ పరివాహక ప్రాంతాన ఉన్న ఆయన ఇల్లు వరద తాకిడి కొట్టుకుపోయింది. ఏళ్లుగా ఉంటున్న పురాతన పెంకుటిల్లు వరదలకు ధ్వంసం అయినట్లు తెలుస్తుంది. శర్వానంద్ తాతగారు మైదుకూరి హరిప్రసాద్ అణు శాస్త్ర వేత్త కావడం విశేషం.
సొంత ఊరికి వెళ్లిన ప్రతిసారి శర్వానంద్ ఆ ఇంటిలోనే ఉంటారట. అలాంటి పాత జ్ఞాపకం కూలిపోవడంతో శర్వానంద్ మరియు కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శర్వా శ్రీకారం అనే ఓ ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శర్వా యువ రైతు పాత్ర చేయడం విశేషం. అలాగే ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో మహా సముద్రం అనే మూవీకి సైన్ చేశారు.
త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. మహా సముద్రం మూవీలో సిద్ధార్ధ్ మరో హీరోగా నటిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా మహా సముద్రం తెరకెక్కనుందని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.
Most Recommended Video
బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!