Shatamanam Bhavati: ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’.. ఆరంభంలోనే ఇలా ఎందుకు..?!
- February 26, 2024 / 10:43 AM ISTByFilmy Focus
2017 శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శతమానం భవతి’ అనే సినిమా వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. పోటీగా చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150 ‘ బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలు ఉన్నాయి. అయినా సరే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. పెట్టిన దానికి రెండింతల లాభాలను అందించింది ‘శతమానం భవతి’ చిత్రం. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.
ఆయనకు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు అందించడం బాగా తెలుసు. ఏ సీజన్లో ఏ సినిమా నిలబడుతుందో కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే టాలీవుడ్లో దిల్ రాజుకి తమ సినిమాలను స్పెషల్ షోలు వేసి మరీ ఆయన ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటారు ఇండస్ట్రీ పెద్దలు. ‘శతమానం భవతి’ సినిమాకి గాను నేషనల్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. (Shatamanam Bhavati) ‘శతమానం భవతి’ చిత్రానికి సీక్వెల్ ను కూడా రెడీ చేస్తున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న.

దీనిని కూడా దిల్ రాజే నిర్మించబోతున్నారు. ఇది కూడా సంక్రాంతి సీజన్ కి సెట్ అయ్యే సినిమా. అందుకే 2025 సంక్రాంతికే దీనిని విడుదల చేయాలని ఆయన భావించి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఆ టైంకి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు లేవు అని ఇన్సైడ్ టాక్. అందుకే దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న వెంకటేష్ – అనిల్ రావిపూడి..ల సినిమాని ఆ టైంకి రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు సమాచారం.
సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!















