ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడని రాజ్ కుంద్రాపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. గత రెండు రోజులుగా ఈ అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన వార్తలే. అయితే ఈ మొత్తం వ్యవహారంతో శిల్పాశెట్టి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
దీంతో ఆమె జడ్జిగా ఉన్న ఓ రియాలిటీ షో నుండి తప్పుకోవాలని శిల్పాశెట్టి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో శిల్పాశెట్టి స్థానంలో కరిష్మా కపూర్ కనిపించడంతో రూమర్స్ కు మరింత బలం చేకూరింది. అయితే కరిష్మా కపూర్ కేవలం ఒక్క ఎపిసోడ్ కి మాత్రమే గెస్ట్ గా వచ్చారని.. షో మొత్తానికి కొనసాగరని సన్నిహితుల వర్గాల సమాచారం. దీంతో శిల్పాశెట్టి స్థానంలో మరొకరు వస్తారా లేక తిరిగి ఆమెనే జడ్జిగా తీసుకొస్తారా అనేది చూడాల్సివుంది.
మరోపక్క శిల్పాశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘హంగామా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శిల్పా.. ఈ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని భావించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్ కుంద్రా అరెస్ట్ తో ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉంది.