Manchu Lakshmi: ట్రెడిషనల్ లుక్‌లో హీటెక్కించే అందం..మంచు లక్ష్మి కిల్లర్ లుక్.. స్టన్నింగ్!
- October 30, 2024 / 11:03 PM ISTByFilmy Focus
ఇటీవల మంచు లక్ష్మి (Manchu Lakshmi) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన తాజా వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ తో ఉన్నా, గ్లామర్ టచ్ కలిపిన ఈ లుక్ నెటిజన్లను మంత్ర ముగ్ధులను చేస్తోంది. పచ్చని చెట్ల నడుమ తెల్లని డ్రెస్ లో, ఎలిగెంట్ లుక్ తో ఉన్న మంచు లక్ష్మి అందరినీ ఆకట్టుకుంటున్నారు. మిఠాయిలా తియ్యగా కనిపించే ఈ లుక్ కి “పండగ టైమ్ లో మిఠాయి” అని సరదాగా క్యాప్షన్ పెట్టారు.
Manchu Lakshmi
ఈ ఫోటోల్లో మంచు లక్ష్మి(Manchu Lakshmi) ధరించిన జువెలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమెరాల్డ్ స్టోన్స్, ముత్యాలతో అలంకరించిన చెవి రింగ్స్, నెక్లెస్, చూడీలు అన్నీ కలిపి ఆమె గ్లామర్ లుక్ కి మరింత అందాన్ని తెచ్చాయి. చాలా మంది హీరోయిన్లు సాధారణంగా సింపుల్ లుక్ ని ప్రదర్శిస్తారు కానీ, మంచు లక్ష్మి మాత్రం తన స్టైల్‌లో ప్రత్యేకతను చూపిస్తున్నారు. ఈ కొత్త లుక్ చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో మంచు లక్ష్మి(Manchu Lakshmi) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన కొత్త లుక్స్ ని తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రతి ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమె లుక్ కి ఫిదా అవుతూ లైకులు, కామెంట్లు చేయడంలో తెగ హడావిడి చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ఆమె నటిస్తున్న ‘ఆదిపర్వం’ సినిమా నవంబర్ 8న విడుదల కానుంది. పిరియడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా మీద క్రేజ్ బాగా ఉంది. బాలీవుడ్ లో కూడా అవకాశాల కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ముంబైకి షిఫ్ట్ అయిన మంచు లక్ష్మి,(Manchu Lakshmi) అక్కడ కూడా కొత్త ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నారు. మరి ఈ గ్లామర్ తో అమ్మడికి బాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.












