బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అమితాబ్ బచ్చన్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. వయస్సు పెరుగుతున్నా అమితాబ్ బచ్చన్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. కథ నచ్చితే తెలుగులో కీలక పాత్రలలో నటించడానికి అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే అమితాబ్ కు కూడా కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయట. తాజాగా ఒక సందర్భంలో అమితాబ్ ఆ విషయాలను వెల్లడించారు. నా కాళ్లు పొడవుగా ఉన్నాయని ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగ్యాన్ని తిరస్కరించారని అమితాబ్ చెప్పుకొచ్చారు.
కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ లో భాగంగా అమితాబ్ ఈ విషయాలను వెల్లడించడం జరిగింది. నా ఎత్తు వల్ల ఉద్యోగం విషయంలో సమస్యలు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు. చదువు పూర్తైన తర్వాత నేను ఎయిర్ ఫోర్స్ లో చేరాలని భావించానని అమితాబ్ తెలిపారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత ఏం చేయాలో నాకు తోచలేదని ఆ సమయంలో నేను కుటుంబంతో కలిసి ఢిల్లీలో ఉండేవాడినని మా ఇంటి సమీపంలో ఒక ఆర్మీ మేజర్ ఉండేవారని అమితాబ్ పేర్కొన్నారు.
ఆయన నన్ను పెద్ద ఆఫీసర్ ను చేస్తానని అన్నారని మా నాన్న నన్ను ఆయనతో పంపించడంతో ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్లాలని అనుకున్నానని అమితాబ్ చెప్పుకొచ్చారు. అయితే నా కల నెరవేరలేదని నా కాళ్లు పొడుగుగా ఉన్నాయనే కారణంతో నన్ను తిరస్కరించారని అమితాబ్ కామెంట్లు చేశారు. అమితాబ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అమితాబ్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంది.
అమితాబ్ (Amitabh) కెరీర్ పరంగా సాధించిన విజయాలు అన్నీఇన్నీ కావు. అమితాబ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా సినిమాకు అమితాబ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.