జనసేన అధినేత, డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత కొన్ని నెలలుగా పూర్తిస్థాయిలో రాజకీయాలకు పరిమితమయ్యారు. పవన్ కళ్యాణ్ మరో రెండు లేదా మూడు నెలల తర్వాత పవన్ సినిమా షూటింగ్ లలో పాల్గొనే అవాకాశాలు అయితే ఉన్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే పవన్ సినీ కెరీర్ లో ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చిన సినిమాలలో బాలు (Balu) సినిమా ఒకటి. కరుణాకరన్ (A. Karunakaran) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫ్యాన్స్ కు నచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
అయితే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని పవన్ కళ్యాణ్ భావించాడట. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో పవన్ చాలా ఫీలయ్యారట. బాలు సినిమా కమర్షియల్ గా ఫ్లాపైనా ఈ సినిమాలోని పాటలు మాతం హిట్ అయ్యాయి. బాలు సినిమా రిలీజ్ తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమాల ఫలితాల గురించి పట్టించుకోవడం మానేశారట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాల్లో నటించారట.
ఒకానొక సమయంలో వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ పరంగా ఇబ్బంది పవన్ గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అత్తారింటికి దారేది (Attarintiki Daredi) , వకీల్ సాబ్ (Vakeel Saab) , భీమ్లా నాయక్ (Bheemla Nayak) , బ్రో (Bro Movie) సినిమాలతో పవన్ కళ్యాణ్ హిట్లు సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ కంటే పొలిటికల్ కెరీర్ కే ప్రాధాన్యత ఇస్తుండగా పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను మాత్రమే పూర్తి చేయనున్నారని సమాచారం అందుతోంది.
పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పారితోషికం ప్రస్తుతం 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా టాప్ లో ఉన్నారు.