అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఇప్పటికే సినిమాలో కొన్ని పాటలు విడుదల చేశారు. ఇప్పుడు ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా బిజినెస్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా 15 శాతం సేల్ రేటు తగ్గించారట.
గతంలో ఆంధ్రకు రూ.60 కోట్ల రేషియాలో సినిమాను అమ్మారు. కానీ టికెట్ రేట్ ఇష్యూ రావడంతో రేట్లు తగ్గిస్తారా..? లేదా..? అనే సందేహాలు కలిగాయి. పెద్ద బ్యానర్, రెగ్యులర్ బయ్యర్లు కావడంతో రేటు తగ్గించరనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రేట్లు ఆంధ్ర, సీడెడ్ లో తగ్గించారు. 15 శాతం కట్ చేశారు. అంతేకాదు.. అవసరమైతే జీఎస్టీ కూడా అడ్జస్ట్ చేస్తామని హామీ ఇచ్చారట. ఏపీలో రూ.60 కోట్లకు అమ్మాలనుకున్న సినిమాను రూ.51 కోట్లకు, సీడెడ్ ను రూ.18 కోట్లకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!