‘సర్కారు వారి పాట’ మహేష్ బాబు నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ. గత గురువారం నాడు రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది ఈ చిత్రం. ఆ మిక్స్డ్ టాక్ కు మించి సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి నెగిటివ్ ట్రెండ్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే టాక్ తో సంబంధం లేకుండా మొదటిరోజు నుండీ మంచి కలెక్షన్లను సాధిస్తుంది ‘సర్కారు వారి పాట’.
చాలా ఏరియాల్లో నాన్- రాజమౌళి రికార్డ్స్ ను క్రియేట్ చేసింది కూడా. ఓవర్సీస్ లో ఈ మూవీ $2 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. అక్కడ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మిగిలిన చోట్ల బ్రేక్ ఈవెన్ కు ఇంకా టైం పడుతుంది. అంతా బానే ఉంది కానీ ఈ మూవీకి చిత్ర బృందం వేసుకుంటున్న ఫేక్ కలెక్షన్స్ మాత్రం మహేష్ బాబు స్టార్ ఇమేజ్ ను తగ్గించేలా ఉన్నాయనేది కొందరి వాదన.
మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ హీరోల్లో నెంబర్ 1 రేసింగ్ లిస్ట్ లో ఉంటాడు. అతని సినిమాలకి యావరేజ్ టాక్ వచ్చినా థియేటర్లకు జనాలు వస్తారు. ‘సర్కారు వారి పాట’ చిత్రానికి కూడా జనాలు అదే విధంగా థియేటర్లకు వస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం పోస్టర్ల పై ఫేక్ కలెక్షన్స్ అనవసరంగా వేసుకుంటున్నారు అనే విమర్శలకి గురవుతున్నారు. నిజానికి ‘సర్కారు వారి పాట’ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.93 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.
ఇవి తక్కువ కలెక్షన్లు అయితే కాదు. కానీ మేకర్స్ మాత్రం రూ.100 కోట్లు షేర్ అంటూ పోస్టర్ విడుదల చేశాయి. దీంతో సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ పోస్టర్ల వల్ల ఒరిజినల్ కలెక్షన్స్ ను కూడా ఫేక్ అనుకుంటున్నారు ప్రేక్షకులు.