మన టాలీవుడ్ లో హీరోయిజం కి సరికొత్త నిర్వచనం తెలియచేసిన డైరెక్టర్స్ లో ఒకరు పూరి జగన్నాథ్. రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసిన ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు అప్పట్లో చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. ఇలా కూడా హీరోయిజం పండించొచ్చా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ తో చేసిన సినిమాలు పూరి జగన్నాథ్ ని స్టార్ ని చేసాయి.
మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిట్టు మీద హిట్టు కొడుతూ కొంతకాలం వరకు నెంబర్ 1 స్టార్ డైరెక్టర్ గా కొనసాగాడు. ఇక మహేష్ బాబు తో చేసిన పోకిరి సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ లో అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఈ చిత్రం.
ఇది ఇలా ఉండగా పూరి జగన్నాథ్ తన తల్లిదండ్రులు తన పట్ల వ్యవహరించిన తీరు గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. సాధారణం గా ఎవరైనా సినిమా ఇండస్ట్రీ కి వెళ్ళాలి అనే కోరిక ని తమ తల్లిదండ్రులకు చెప్తే ముందుగా బాగా తిడుతారు, ఇండస్ట్రీ లోకి వెళ్లేందుకు అస్సలు ఒప్పుకోరు.
ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ లేకుండా వెళ్తే అవకాశాలు రావడం చాలా కష్టం, కెరీర్ ని అనవసరంగా సర్వనాశనం చేసుకున్న వాళ్ళు అవుతారని ఒప్పుకోరు. కానీ పూరి జగన్నాథ్ తల్లిదండ్రులు మాత్రం ఆయన చేతిలో 20 వేలు పెట్టి సినిమా ఇండస్ట్రీ కి వెళ్ళు అని ఇంట్లో నుండి తరిమేశారట. అలా హైదరాబాద్ కి వచ్చిన (Director) పూరి జగన్నాథ్ నే నేడు మనమంతా చూస్తోస్తున్నాము.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!