Unstoppable: అన్ స్టాపబుల్ షోకు పిలిస్తే పవన్ కళ్యాణ్ అలా చెప్పారా?

స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షోకు షో సీజన్2 కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్1 అంచనాలకు మించి రెస్పాన్స్ ను సాధించగా సెకండ్ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. చంద్రబాబు ఈ షోకు హాజరు కావడం ఈ షోకు చాలా ప్లస్ అయింది. ఆ తర్వాత ప్రసారమైన ఎపిసోడ్లకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా పూర్తిస్థాయిలో అంచనాలను అందుకోలేదు.

బాలయ్య రేంజ్ కు తగిన గెస్ట్ లు దొరకకపోవడం ఈ షోకు బ్రేకులు పడటానికి అసలు కారణం అని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను ఈ షోకు గెస్ట్ గా పిలవగా ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కు గెస్ట్ గా హాజరవుతానని చెప్పారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇతర భాషల ప్రముఖ సెలబ్రిటీలను కూడా ఈ షోకు గెస్ట్ లుగా ఆహ్వానించడం జరిగిందని అయితే డేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం.

మరోవైపు బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ షూట్ వల్ల కూడా అన్ స్టాపబుల్ షో సీజన్2 కు బ్రేకులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. కొంతమంది సెలబ్రిటీలు ఈ షోకు హాజరు కావడానికి ఆసక్తి చూపిస్తున్నా వాళ్లు బాలయ్య లెవెల్ కు సరిపోరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీజన్1 రేంజ్ లో సీజన్2 సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

ఒక ఎపిసోడ్ కు శృతి హాసన్ హాజరు కానుండగా డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి ఫస్ట్ వీక్ లో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒక ఎపిసోడ్ కు వరుణ్ తేజ్ సాయితేజ్ కలిసి హాజరు కానున్నారని తెలుస్తోంది. గత కొన్ని నెలల నుంచి సాయితేజ్ మీడియాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా కొన్ని వివాదాస్పద ప్రశ్నల గురించి స్పష్టత ఇవ్వాలని సాయితేజ్ భావిస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus