అసలు తాను రాజకీయాల్లోకీ వచ్చిందే ప్రజల సమస్యలను ప్రశ్నించడానికి అంటూ చెప్పిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం జనాలు ఆక్సిజన్, బెడ్, మందులు దొరక్క నానా ఇబ్బందులూ పడుతుంటే సైలెంట్ గా ఉండడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఉద్దానం, సుగాలీ ప్రీతి విషయంలో చాలా యాక్టివ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా అవసరమైన కరోనా సమయంలో తన పోలిటికల్ పవర్ తో పేదలకు, అవసరార్ధులకు కనీసం ఆక్సిజన్ బెడ్ లు కూడా సమకూర్చలేని స్థితిలో ఉన్నాడు.
ఇటీవలే కరోనాను జయించిన పవన్ కళ్యాణ్, తన తోటి జనసైనికులు కరోనా బారిన పడుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా.. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో తన తాజా చిత్రం “వకీల్ సాబ్”ను విడుదల చేసి వేల మంది థియేటర్లకు రావడానికి, కరోనా బారినపడడానికి పరోక్షంగా కారణమయ్యాడు పవన్ కళ్యాణ్. అందుకే కరోనా తీవ్రత గురించి కానీ, దాని వ్యాప్తి గురించి కానీ కనీసం ప్రభుత్వాన్ని,
ప్రభుత్వ యంత్రాంగం లోపాల గురించి ప్రశ్నించడానికి ముందుకు రాలేదు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ వల్ల పవన్ కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా అందుకొని ఉండొచ్చు కానీ.. ఒక వ్యక్తిగా, పొలిటీషియన్ గా వేల కోట్ల రూపాయల విలువల గల ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నాడు. నిజానికి ఈ తరుణంలో జనసేన & టీం జనాలకి అండగా నిలవాలి. అలాంటిది వాళ్ళు మిన్నకుండిపోవడం ఆశ్చర్యం. మరి పవన్ ఇప్పుడైనా ప్రజలకు కనీస స్థాయి ఆసరా ఇస్తాడో లేక సైలెంట్ గానే ఉంటాడో చూడాలి.