Naga Chaitanya, Samantha: చైసామ్ అభిమానులు.. అలాంటి ఆశలు పెట్టుకోవద్దు..!

నాగ చైతన్య, సమంత.. ఇద్దరూ టాలీవుడ్లో మోస్ట్, బెస్ట్, క్యూట్ కపుల్ గా ఓ వెలుగు వెలిగారు. కానీ 4 ఏళ్ళకే వీరి మజిలీ ముగిసింది. పర్సనల్ రీజన్స్ వలన వీళ్ళు విడిపోయారు. అక్టోబర్ 2న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే దానికి రెండు నెలల ముందు నుండే వాళ్ళు విడిగా ఉంటున్నారు. సో టోటల్ గా వీళ్ళు సెపరేట్ అయ్యి 6 నెలలు అయ్యింది. అయితే ఇటీవల తన ఇస్టాగ్రామ్లో సమంత విడాకుల పై చేసిన పోస్ట్ ను డిలీట్ చేయడంతో…

చైసామ్ లు మళ్ళీ కలవబోతున్నారా అనే ఆశలు.. వారి అభిమానుల్లో చిగురించాయి. చైతన్య వైపు నుండీ ఎటువంటి రియాక్షన్ రాకపోయినా ఈ విషయం పై డిస్కషన్లు పెరిగాయి. అయితే ఈ విషయం పై వీరి సన్నిహిత వర్గాన్ని ఆరాతీయగా..! వాళ్ళు ఈ విషయాన్ని ఖండించారు..! ‘వాళ్ళు మానసికంగా విడిపోయి చాలా కాలమే అయ్యింది.కలిసి ఒకే చోట కొన్నాళ్ళు ఉన్నప్పటికీ.. వాళ్ళు కలిసి ఉండలేక విడిపోయారు. వీరి కుటుంబసభ్యులు, పెద్దలు, సన్నిహితులు అంతా డిస్కషన్లు జరిపినప్పటికీ ఉపయోగం లేకపోయింది.

ఇప్పుడు మళ్ళీ కలవడం అనేది ఒట్టి అపోహ. సోషల్ మీడియాలో ఈ అంశం పై ఎన్నో డిస్కషన్లు జరుగుతున్నాయి. వాళ్ళ లైకులు, కామెంట్ల కోసం తప్ప… వీటి వల్ల ఉపయోగం లేదు. లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రాసెస్ కూడా పూర్తయితే… ఇద్దరూ ఎవరి జీవితాల్లో వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది’ అంటూ వాళ్ళు తెలిపారు.ప్రస్తుతానికైతే… సమంత స్విట్జర్లాండ్ లో వెకేషన్లో ఉండగా… నాగ చైతన్య ‘థాంక్యూ’ సినిమా షూటింగ్లో భాగంగా రష్యాలో గడుపుతున్నాడు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus