Pushpa Songs: ‘రంగస్థలం’ లో మంగమ్మ రంగమ్మ స్టైల్ లో ‘పుష్ప’ థర్డ్ సింగిల్… నెటిజన్ల సెటైర్లు..!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సినిమాల్లో పాటలకు ప్రత్యేక స్థానముంది. కథ విషయంలో ఎంత శ్రద్ధ పెడతారో.. పాటలు, వాటి చిత్రీకరణలోనూ అంతే జాగ్రత్త తీసుకుంటారు సుకుమార్. ముఖ్యంగా ఆయన చిత్రాల్లో ఐటెం సాంగ్‌లకు యూత్‌కు మంచి క్రేజ్ వుంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘‘పుష్ప’’. 1980లలో గంధపు చెక్కల స్మగ్లింగ్‌ను కథాంశంగా తీసుకుని సుకుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పుష్పలో బన్నీకి జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా..

మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా థర్డ్ సింగిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సామి సామి అంటూ సాగే ఈ పాట ను మాస్ బీట్ తో కంపోజ్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. మౌనికా యాదవ్ పాడిన ఈ పాట మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. పాట చిత్రీకరించిన విధానం, కాస్ట్యూమ్స్, లిరిక్స్ చూస్తుంటే అచ్చు గుద్దినట్లు రంగ స్థలంలోని ‘‘రంగమ్మ మంగమ్మ’’లా వుంది.

హీరో క్యారెక్టరైజేషన్‌ను హీరోయిన్ వర్ణిస్తూ సాగే ఈ పాటను ఫాలో అయింది ‘‘సామీ నా సామీ’’. అందుకు తగ్గట్టుగానే యూట్యూబ్‌లో రిలీజైన వెంటనే భారీగా వీక్షణలతో దూసుకెళ్తోంది ఈ పాట. ఇకపోతే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న పుష్ప తొలి అర్థభాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus