మెగాస్టార్ చిరంజీవి గారిని.. దాసరి నారాయణరావు గారి తర్వాత ఇండస్ట్రీ పెద్దగా అంతా భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువగా పక్క సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు వెళ్తున్నారు. నిజానికి ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధం లేని ఇంకో స్టార్ హీరో వచ్చాడు అంటే.. ఆ సినిమా నిర్మాతలతో ఆ స్టార్ హీరో సినిమా చేసే అవకాశం ఉంది అని అర్థం.దానయ్యతో ‘ఆర్.ఆర్.ఆర్’ చేస్తున్నాడు కాబట్టే ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్ళాడు.
అలాగే ‘మైత్రి’ బ్యానర్లో సినిమా చేస్తున్నాడు కాబట్టే ‘అంటే సుందరానికి’ ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. కానీ చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా భావించి చాలా మంది నిర్మాతలు తమ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు ఆహ్వానిస్తున్నారు. పక్క సినిమాలను ప్రమోట్ చేయడానికి.. టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి చిరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో అదే ఆయన పై విమర్శలు కురిపించేలా చేస్తుంది.
ఈ ఏడాది చిరు ఏదైనా సినిమా వేడుకకు వెళ్తే ఆ సినిమా ప్లాప్ అయ్యిందని కొందరు నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తాప్సి నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు వెళ్లారు. ఆ సినిమా ఆడలేదు.పైగా ఆ సినిమా నిర్మించింది ‘ఆచార్య’ నిర్మాత నిరంజన్ రెడ్డి కాబట్టి ఆ వేడుకకు చిరు వెళ్ళక తప్పలేదు. ఇక తర్వాత ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ వేడుకకు చిరు వెళ్ళారు. ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.
అలాగే ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించారు. ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. ఇక ఈ మధ్యనే ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్ళారు. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి చిరు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమా కూడా కచ్చితంగా ప్లాప్ అవుతుంది అని అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో విషయం ఉండాలి.. ఆ సినిమాపై బజ్ ఏర్పడాలి కానీ చిరు ప్రమోషన్ కు వెళ్తే సినిమా ప్లాప్ అవుతుందా.. ఏంటి..!