బుల్లితెర యాంకర్ గా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెర వెండితెర పై అవకాశాలను అందుకుని దూసుకుపోతున్నారు. ఇలా ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్న శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా చేసిన పని కారణంగా దారుణంగా నెటిజన్ల ఆగ్రహానికి గురి అవుతుంది. ఈ విధంగా నెటిజన్లు శ్రీముఖి పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏమిటి?
అంతగా శ్రీముఖి ఏం చేసింది అనే విషయానికి వస్తే… సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది. ఇలాంటి యాప్స్ కారణంగా యువత తప్పుదోవ పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి యాప్స్ గురించి పలువురు సినీ తారలు ప్రమోట్ చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే శ్రీముఖి కూడా ఈ బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేస్తూ ఒక వీడియోని షేర్ చేయడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ శ్రీముఖి నిన్ను యాంకర్ గా ఎంతగానో అభిమానించాము. కానీ నువ్వు మాత్రం డబ్బుకోసం చాలా దారుణంగా దిగజారి పోయావు. డబ్బు సంపాదించడం కోసం ఇలాంటి చెత్త యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు.
డబ్బు కోసం ఏ పనైనా చేస్తావా? అంటూ దారుణంగా ఈమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా శ్రీముఖి బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేయడంతో నెటిజన్లు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విధంగా పలువురు సెలబ్రిటీలు ఈ యాప్ గురించి ప్రమోట్ చేయడంతో ఎంతోమంది ఈ యాప్ ద్వారా డబ్బును పెట్టుబడిగా పెట్టి తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. ఇలా నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇలాంటి యాప్స్ గురించి ప్రమోట్ చేస్తూ సమాజానికి ఏం తెలియచేయాలి అనుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున యాప్స్ గురించి ప్రమోట్ చేసే సెలబ్రిటీల పై ఇదివరకే ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా శ్రీముఖి పై కూడా నెటిజన్లు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై శ్రీముఖి ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.