Boss Party Song: దేవి మళ్ళీ దొరికిపోయాడు.. ట్రోలింగ్ షురూ..!

మెగాస్టార్ చిరంజీవి- దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అనగానే మనకి ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ ‘ఖైదీ నెంబర్ 150’ సాంగ్స్ గుర్తుకొస్తాయి. ఆ సినిమాల్లోని సాంగ్స్ ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. ప్లాప్ అయినప్పటికీ ‘అందరివాడు’ ‘శంకర్ దాదా జిందాబాద్’ పాటలు కూడా ఔరా అనిపిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో దేవి శ్రీ ప్రసాద్ ఫామ్లో లేడు. అందువల్ల పెద్ద ప్రాజెక్టులన్నీ తమన్ తన్నుకుపోతున్నాడు. అయితే దేవి పై ఉన్న నమ్మకంతో..

చిరంజీవి ఏరి కోరి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. చిరు నిర్ణయాన్ని దర్శకుడు బాబీ కూడా గౌరవించి ఓకే చేశారు. అయితే గ్లిమ్ప్స్ వీడియో చూశాక దేవి.. చిరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా లేదా అనే డౌట్ వచ్చింది. ఇక రేపు ‘బాస్ పార్టీ’ పేరుతో ‘వాల్తేరు వీరయ్య’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతున్న తరుణంలో ఈరోజు చిన్న ప్రోమో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.

ఈ చిన్న ప్రోమోతోనే బోలెడంత నెగిటివిటీని మూటగట్టుకున్నాడు దేవి. ‘నువ్వు లుంగీ ఎత్తుకో.. షర్ట్ వేసుకో..బాసోస్తుండు’ అంటూ అతనే పాడుతూ కనిపించడం జనాల సహనానికి పరీక్షలా మారింది. అయితే ఫుల్ సాంగ్ వినకుండా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ నెటిజన్లకు అలాంటి ఓపిక ఉండదు కదా.! అందుకే ఈ ప్రోమోని కూడా ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఓ విధంగా ఈ ట్రోలింగ్ కూడా రేపు రిలీజ్ అయ్యే ‘బాస్ పార్టీ’ ఫుల్ సాంగ్ పై ఫోకస్ పడేలా చేసిందని చెప్పాలి.

1

2

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus