కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఓ పక్క సౌత్ లో వరుస సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ పుట్టినరోజు పార్టీకి హాజరైంది. దక్షిణాది నుంచి ఆహ్వానం అందుకున్న అతికొద్ది మంది సినీ సెలబ్రిటీల్లో రష్మిక మందన్న ఒకటి. పార్టీకి బ్లాక్ డ్రెస్ లో హాజరు కావాలనేది కోడ్ పెట్టుకున్నట్లు ఉన్నారు. దానికి తగ్గట్లే అందరూ బ్లాక్ డ్రెస్ లోనే పార్టీకి వచ్చారు.
అందరిలానే రష్మిక కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఆ డ్రెస్ ఆమె థైస్ కనిపించేలా ఉండడంతో ఫొటోలకు పోజులు ఇవ్వడానికి ఇబ్బంది పడింది. పెద్దగా ఫొటోలు తీయనివ్వలేదు. మాటిమాటికి డ్రెస్ ను పట్టుకుంటూ కనిపించింది. దీంతో నెటిజన్స్ రష్మిక మందన్నను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఇబ్బందిగా అనిపించినప్పుడు ముందుగా తెలియదా..? తెలిసినప్పుడు అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బ్లాక్ డ్రెస్ లో రష్మిక చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈమె తెలుగు, తమిళ భాషల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తుండగా.. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇది కాకుండా పాన్ ఇండియా సినిమాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప ది రూల్’ సినిమాలో నటిస్తోంది.