Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో షాకింగ్ నిజాలను బయటపెట్టిన ఈడి !
- August 27, 2021 / 06:26 PM ISTByFilmy Focus
ఎవ్వరూ ఊహించని విధంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈడీ అధికారులు కీలక ఆధారాలను రాబట్టినట్టు తాజా సమాచారం. కెల్విన్ అనే వ్యక్తిని గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతనికి యూ.ఎస్ లో డ్రగ్స్ డీలర్స్ తో సంబంధాలు ఉన్నట్టు తేలింది. కొరియర్ సర్వీసు ద్వారా డ్రగ్స్ దిగుమతి అయినట్టు కూడా విచారణలో భాగంగా బయటపడింది.టాలీవుడ్ స్టార్లు అయిన రవితేజ, తనీష్, ఛార్మీ, నవదీప్, రకుల్ ప్రీత్ సింగ్, వంటి వారికి ఆల్రెడీ ఈడీ సమన్లు పంపింది. ఎక్సైజ్ పోలీసులు విచారణని మరింత వేగవంతం చేశారు.
డార్క్ వెబ్ ద్వారా కొంతమంది ప్రముఖులు డ్రగ్స్ ను అందుకుంటున్నట్టు వారు ఆధారాలతో సహా బయటపెట్టారు.ముఖ్యంగా టాలీవుడ్ నటుడు నవదీప్ కు అలాగే అతనికి చెందిన ఎఫ్ క్లబ్ కు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా అయినట్టు కూడా వారు గుర్తించారు. దీంతో ఆ ఎఫ్ క్లబ్ మేనేజర్ కు కూడా సమన్లు అందాయని స్పష్టమవుతుంది. అతి త్వరలో వీళ్ళని మళ్ళీ విచారించే అవకాశం ఉంది. మరోపక్క కెల్విన్ తో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న పీటర్ అనే వ్యక్తి బ్యాంకు డీటెయిల్స్,ఆన్లైన్ లావాదేవీల డీటెయిల్స్ ను కూడా పరిశీలిస్తుందట ఈడీ.
ఈ కేసులో టాలీవుడ్ నుండీ ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది భోగట్టా. త్వరలో వాళ్లకు కూడా సమన్లు వెళ్లే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!















