టాలీవుడ్ ప్రాణం పోసుకున్నప్పటినుంచి దాదాపుగా అన్ని సినిమాలు 3గంటల నిడివి ఉండేవి….అయితే అప్పట్లో పౌరాణికాలు, జానపదాలు అన్నీ దాదాపుగా మూడు గంటల పైనే ఉండేవి….ఇదిలా ఉంటే తాజాగా ఈ నిడివి కాస్త రెండు, రెండున్నర గంటలకు కుదిస్తున్నారు…అయితే ఈ మార్పుకు కారణం కధలో బలం లేకపోవడమా అంటే కానే కాదు…ఇదంతా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేసేందుకే అంటారు మన దర్శక నిర్మాతలు అంతేకాదు లే మన ప్రేక్షకులు కూడా అలానే ఉన్నారు…సినిమా కాస్త పెద్దదైతే చాలు విమర్శలు గుప్పించేస్తున్నారు….ఇదిలా ఉంటే ఇదే విషయంలో నందమూరి నట సింహం బాలయ్య నటిస్తున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సరికొత్త నిర్ణయానికి తెరతీసింది..ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం అంటే….”గౌతమీపుత్ర శాతకర్ణి ” నిడివి కేవలం రెండు గంటల 12 నిముషాలు ఉంటుందట.
నిజమే మీరు వింటున్నది కరక్టే…ఇందులో ఎక్కవ శాతం యుద్ద సన్నివేశాలే ఉండడం, ఈ మద్య ఆడియెన్స్ కూడా ఎక్కువ సేపు థియేటర్లో కూర్చునే అవకాశం లేకపోవడం, వీటన్నింటి ఆలోచనలోకి తీసుకుని ఈ సినిమా నిడివి తగ్గించి నట్లు సమాచారం. ఇక దర్శకుడు క్రిష్ కూడా అలానే అంటున్నాడు….తెలుగు చక్రవర్తి అయిన గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర గురించి చెప్పాలంటే కనీసం రెండు పార్టు లుగా చెప్పాలి లేదా 3 గంటల నిడివి తప్పనిసరి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు మూడు గంటల సమయం భరించడం కష్టం కాబట్టి క్రిష్ ముందుగానే సినిమాలో ముఖ్యమైన ఘట్టాలు ఏవో వాటిని మాత్రమే తీసుకొని సినిమా చేసినట్లు చెబుతున్నాడు…ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇక సంక్రాంతి బరిలో దిగుతున్న సింహం ఎలాంటి రికార్డుల ప్రభంజనానికి తెర తీస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.