Bigg Boss Telugu OTT: హౌస్ మేట్స్ కి శ్రీరాపక ఎందుకు టార్గెట్ అయ్యింది?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో లైవ్ అప్డేట్స్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు, ప్రతి నిమిషం హౌస్ లో ఏం జరుగుతోంది అనేది సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేసేస్తున్నారు బిగ్ బాస్ లవర్స్. ఇక్కడే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ ఇచ్చాడు. ఇప్పటి వరకూ హౌస్ లో ఎవరి నుంచీ గుడ్ వైబ్స్ వచ్చాయి ? ఎవరి నుంచీ బ్యాడ్ వైబ్స్ వచ్చాయో చెప్పమని చెప్పాడు. దీంతో అందరూ తమకి ఎవరు కనెక్ట్ అవుతున్నారో చెప్పుకొచ్చారు.

ఇక్కడే శ్రీరాపకకి తనకి అస్సలు సింక్ అవ్వడం లేదని, టాస్క్ లో నన్ను ఓవర్ యాక్టింగ్ అనడం నచ్చలేదని అరియానా డిస్ లైక్ ట్యాగ్ ఇచ్చింది. తర్వాత ముమైత్ ఖాన్ కూడా ఎందుకో గుడ్ వైబ్స్ రావడం లేదని చెప్పింది. తర్వాత అఖిల్ నువ్వు నన్ను రా అని అనబోయావని నాతో ఫన్ చేయబోయావని అది నాకు నచ్చలేదని అదే విషయం అడిగితే నేను అలా అనటానికి పిలవలేదని అబద్దం చెప్పావని అన్నాడు. దీంతో శ్రీరాపక ఎమోషనల్ అయ్యింది.

అస్సలు అబద్దం అనేది పెద్ద లేబుల్ అని నేను నిజంగా అబద్దాలు చెప్పే మనిషిని కాదని వాపోయింది. అంతేకాదు, వేరే షోలో జరిగినది ఇక్కడ గుర్తుపెట్టుకుని ముమైత్ ఖాన్ నన్ను టార్గెట్ చేస్తోందని తోటి హౌస్ మేట్స్ తో చెప్పుకుని బాధపడింది. ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో కూర్చుని ఇదే విషయాన్ని అఖిల్ తో డిస్కషన్ చేసింది. నేను నిజంగా నిన్ను అలా అనడానికి పిలవలేదని నమ్మమని చెప్పింది. చాలాసేపు వాష్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చిన తర్వాత టాస్క్ వినడానికి వచ్చింది.

శ్రీరాపక కోసం చాలాసేపు హౌస్ మేట్స్ వెయిట్ చేశారు. శ్రీ వచ్చిన తర్వాత టాస్క్ పేపర్ చదవడం స్టార్ట్ చేసింది బిందుమాధవి. ఇక హౌస్ మేట్స్ శ్రీరాపకని టార్గెట్ చేస్తున్నారా ? లేదా కావాలనే శ్రీరాపక టార్గెట్ అవుతోందా అనేది మరో వారం గడిస్తేనే కానీ చెప్పలేం. ప్రస్తుతం నామినేషన్స్ లో లేదు కాబట్టి శ్రీరాపక ఈవారం సేఫ్ జోన్ లోనే ఉంది. అదీ మేటర్.

[yop_poll id=”9″]

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus