సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఈ ఏడాది చాలా మంది ప్రముఖులు మరణించారు. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, హాలీవుడ్, కోలీవుడ్, మలయాళం, భోజ్ పురి, మరాఠి, కన్నడ ఇలా పక్క రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు కూడా అనేక కారణాల వల్ల మరణిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అనారోగ్య సమస్యలతో కావచ్చు, వయోభారంతో ఇంకొంతమంది, ప్రమాదాల బారిన పడి ఇంకొంతమంది.. ఇవన్నీ కాదు అంటే సూసైడ్ చేసుకుని ఇంకొంతమంది ఇలా వివిధ కారణాలతో ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు.
ఒకవేళ సినీ సెలబ్రిటీలు కాకపోతే వారి కుటుంబ సభ్యులు కూడా మరణించడం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఓ నటుడికి గుండెపోటు రావడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నటుడు శ్రేయస్ తల్పడే గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 47 ఏళ్లు మాత్రమే కావడం విషాదకరం. సినిమా షూటింగ్లో పాల్గొంటున్న టైంలో ఊహించని విధంగా ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే అతన్ని వెంటనే హాస్పిటల్ కి తరలించారట.
ప్రస్తుతం (Shreyas Talpade) శ్రేయస్ తల్పడేకి వైద్యుల సంరక్షణలో చికిత్స పొందుతున్నారు. దీంతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆందోళన నెలకొంది. శ్రేయస్ తల్పడే.. ‘గోల్ మాల్'(సిరీస్) ‘గ్రాండ్ మస్తీ’ ‘ఓం శాంతి ఓం’ ‘కౌన్ ప్రవీణ్ తాంబే’ వంటి చిత్రాల్లో నటించారు. ఇతను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా..! హిందీలో డబ్బింగ్ అయిన అనేక పరభాషా చిత్రాలకి ఇతను డబ్బింగ్ చెప్పాడు. ‘పుష్ప’ హిందీ వెర్షన్లో అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఇతనే..!