Shyam Singh Roy Twitter Review: నాని బిగ్ బడ్జెట్ మూవీ ఎలా ఉందంటే!

  • December 24, 2021 / 09:14 AM IST

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మరో సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా నాని కెరీర్లో కూడా అతి పెద్ద సినిమా అనే చెప్పవచ్చు. నిర్మాతలు దాదాపు 40 కోట్ల వరకు ఖర్చు చేశారు. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదల కాబోతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు.

సినిమాను చూసిన ప్రేక్షకులు వారి అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. చూస్తుంటే నాని సినిమాకు మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ఒక పిరియాడిక్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఫిల్మ్ అని దర్శకుడు ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. ఇక సినిమాలో అన్నిటికంటే ముఖ్యంగా నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. రెండు కాలాల్లో కొనసాగే పాత్రలో నాని నటన అద్భుతం అని చెబుతున్నారు.

ఇక సాయి పల్లవి సినిమా లో ఉంటే చాలు అని, మరోసారి ఆమె తన నటనతో సినిమాకు ప్రాణం పోసినట్లుగా చెబుతున్నారు. ఇక కృతి శెట్టి కూడా చాలా బోల్డ్ గా కనిపించింది అని ఆమె తన పాత్రకు న్యాయం చేసినట్లు కూడా రివ్యూలు అందిస్తున్నారు. సినిమా ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా నెమ్మదిగా కొనసాగుతుంది అని ముఖ్యంగా క్లైమాక్స్ అనుకున్నంత స్థాయిలో లేదు అని కూడా అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

కొన్ని సన్నివేశాలు అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేవని కూడా చెబుతున్నారు. కోర్ట్ సీన్స్ కూడా సినిమాల్లో కొత్తగా నమ్మదగినవి ఉండవు అని, దర్శకుడు అలాంటి సన్నివేశాలను ఇంకా బాగా చూపించి ఉంటే సినిమా మరో లెవెల్ లో ఉండేవి అని కూడా చెబుతున్నారు. ఇక టక్ జగదీశ్ సినిమా తర్వాత నాని నుంచి మరొక నిరుత్సాహపరిచే సినిమా కూడా వచ్చిందని మరికొందరు కామెంట్స్ చేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus