కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి ఈ సినిమా టైటిల్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ సినిమా ఇప్పటికే 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఏకంగా 11 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. నైజాం ఏరియాలో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
కృష్ణంరాజు (Krishnam Raju) సతీమణి కల్కి సినిమా గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ (Prabhas) పెదనాన్న కృష్ణంరాజు 40 సంవత్సరాల క్రితం కల్కి అనే టైటిల్ తో ఒక సినిమాను మొదలుపెట్టారట. ఈ సినిమా కోసం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి (M. M. Keeravani) ఒక సాంగ్ కూడా రికార్డ్ చేశారట. ఈ సాంగ్ ఎం.ఎం.కీరవాణి తొలి సాంగ్ అని సమాచారం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందట.
ఇప్పటికీ కీరవాణి ఇంట్లో ఉన్న పూజగదిలో కృష్ణంరాజు కల్కి మూవీ కోసం రికార్డ్ చేసిన సాంగ్ ఉందని శ్యామలాదేవి తెలిపారు. కృష్ణంరాజు కల్కి టైటిల్ తో సినిమాను మొదలుపెట్టి మధ్యలో ఆపేయగా ప్రభాస్ మాత్రం అదే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. కల్కి టైటిల్ తోనే ప్రభాస్ సినిమా తెరకెక్కడం యాదృచ్ఛికం అని శ్యామలాదేవి అభిప్రాయపడ్డారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin)(Nag Ashwin) టాలెంట్ ను సైతం కృష్ణంరాజు ప్రశంసించారని కల్కి సినిమా మొదలైన సమయంలో కృష్ణంరాజు కల్కి సెట్ కు వెళ్లి నాగ్ అశ్విన్ ను కలిశారని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ సైతం దర్శకునిగా అంచలంచెలుగా ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. తన సినిమాలతో ఈ దర్శకుడు కమర్షియల్ సక్సెస్ లను సొంతం చేసుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.