సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. చిన్న చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఇతను ‘గుంటూర్ టాకీస్’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చేసిన ‘డిజె టిల్లు’ (DJ Tillu) సినిమా సూపర్ హిట్ అయ్యింది.దానికి సీక్వెల్ గా చేసిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) సినిమా వంద కోట్ల క్లబ్లో చేరి ఇతన్ని స్టార్ హీరోని చేసేసింది. ప్రస్తుతం సిద్ధుకి మంచి డిమాండ్ ఉంది. అతను ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు.
Siddhu Jonnalagadda
ఇతనితో దర్శకనిర్మాతలకు ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే.. ఇతనిలో మంచి రైటర్ ఉండటం. సొంతంగా కథలు రాసుకోగలడు.. ఎలాంటి కథకైనా మంచి మెరుపులు దిద్దగలడు. అందుకే ఇతనికి డిమాండ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఇతను ఆంధ్రప్రదేశ్, నరసాపురం సమీపంలో ఉన్న పేరుపాలెంలో కనిపించి సందడి చేశాడు. పేరుపాలెం బీచ్ చాలా ఫేమస్ అనే సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న ఒక చిన్న హోటల్లో టిఫిన్ చేస్తూ కనిపించాడు సిద్ధు (Siddhu Jonnalagadda). అతని పక్కనే నటుడు వైవా హర్ష కూడా ఉన్నాడు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. షూటింగ్లో భాగంగా సిద్ధు అక్కడికి వేళ్ళాడేమో అని అంతా చెప్పుకుంటున్నారు. మరికొంతమంది ‘స్టార్ అయినప్పటికీ సిద్ధు జొన్నలగడ్డ సింపుల్ గా ఒక రేగు షెడ్డులో కూర్చుని టిఫిన్ చేయడాన్ని’ మెచ్చుకుంటున్నారు ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో ‘జాక్’ (Jack) అనే సినిమా చేస్తున్నాడు. మరోపక్క నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. మరి వీటిలో.. ఏ సినిమా షూటింగ్ పేరుపాలెం బీచ్లో జరుగుతుందో తెలియాల్సి ఉంది.