‘డీజే టిల్లు’ సీక్వెల్ గురించి సిద్దు జొన్నలగడ్డ ప్రామిస్.. వైరల్ అవుతున్న పోస్ట్..!

‘డీజే టిల్లు’.. చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ కొండెక్కి కూర్చుంది. కిరాక్ పర్ఫార్మెన్స్, డిఫరెంట్ యాటిట్యూడ్, ముఖ్యంగా తెలంగాణ యాసలో ఇరగ దీసేశాడు. యూత్‌లో మాంచి ఫాలోయింగ్ కూడా పెరిగింది. బర్త్‌డే నుండి బారాత్ వరకు ఎక్కడ విన్నా, ఫంక్షన్ ఏదైనా ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్‌తో జంక్షన్ జామ్ చేసేస్తున్నారు జనాలు.. యూత్ లూప్ మోడ్‌లో, ఫేవరెట్ ప్లే లిస్టులో పెట్టేసుకున్నారీ పాటని.

స్టోరీ, స్క్రీన్‌ప్లేతో పాటు డైలాగ్స్‌లో కూడా సిద్దు దుమ్ము దులిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ఈ మూవీ.. రూ. 8.95 కోట్లు బిజినెస్ చేసి, రూ. 9.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో దిగింది. ఆంధ్ర, తెలంగాణలో రూ. 14.14 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ షేర్ : రూ. 17.25 కోట్లు, టోటల్ గ్రాస్ : రూ. 30.30 కోట్లు, టోటల్ ప్రాఫిట్ : రూ. 7.75 కోట్లతో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది.

ఇప్పుడు ‘డీజే టిల్లు’ కి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. స్టార్ బోయ్ సిద్ధు పక్కన మలయాళీ ముద్దుగుమ్మ అనపమ పరమేశ్వరన్ హీరోయిన్ అని అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడామె ప్లేసులో మరో మాలీవుడ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ వచ్చి చేరిందని సమాచారం. మల్లిక్ రామ్ దర్శకత్వంలో.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, త్రివిక్రమ్‌కి చెందిన ఫార్చ్యూన్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. టైటిల్ రివీలింగ్ వీడియోతోనే రచ్చ లేపాడు టిల్లు..

ప్రస్తుతం షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ఇస్తూ.. సిద్దు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఈ సారి ఫ్రెష్ ఫీల్, కొత్తగా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నా’ అంటూ సిద్దు జొన్నలగడ్డ ట్వీట్ చేశాడు. షూట్‌లో ఫుల్ జోష్‌లో ఉన్న పిక్ ఒకటి షేర్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus