Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఫేమస్ కాకముందు అతి చిన్న పాత్రలు చేసిన నేటి బిగ్ స్టార్స్

ఫేమస్ కాకముందు అతి చిన్న పాత్రలు చేసిన నేటి బిగ్ స్టార్స్

  • February 4, 2017 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫేమస్ కాకముందు అతి చిన్న పాత్రలు చేసిన నేటి బిగ్ స్టార్స్

సినీ ప్రపంచంలో అవకాశం రావడం అంత ఈజీ కాదు. ఛాన్స్ వచ్చినా మంచి పాత్రలు అందుకోవడం కూడా అదృష్టంతో కూడుకొని ఉంటుంది. సినిమానే ధ్యాసగా, శ్వాసగా కస్టపడి శ్రమిస్తే మంచి పొజిషన్ కి చేరుకోవచ్చని ఎంతమంది నిరూపించారు. ఆలా ఇప్పుడు మంచి స్టార్స్ గా గుర్తింపు తెచుకున్నవారు.. కెరీర్ తొలినాళ్లలో గుంపులో గోవిందు పాత్రల్లో కనిపించారు. మనం వారిని అప్పుడు గుర్తుపట్టలేము. ఇప్పుడు ఒక సారి ఆ చిత్రాలను చూస్తే అవాక్కవుతాం. అలా అతి చిన్న రోల్స్ చేసిన నటీనటులపై ఫోకస్..

రవితేజRavitejaఅసిస్టెంట్ డైరక్టర్ గా చిత్ర సీమలోకి అడుగుపెట్టి మాస్ మహారాజ్ గా ఎదిగిన వ్యక్తి రవితేజ. ఈయన చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ఏ చిన్న అవకాశం వచ్చినా వెండితెరపై కనిపించేవారు. కొన్నింటికి అసలు డైలాగులు కూడా ఉండవు. అయినా చేశారు. అటువంటి వాటిలో అల్లరి ప్రియుడు ఒకటి. ఇందులో రాజశేఖర్ గ్యాంగ్ లో ఒకడిగా చిన్న పాత్ర చేశారు.

సునీల్ Sunilహాస్యనటుడిగా నవ్వించి హీరోగా మెప్పిస్తున్న నటుడు సునీల్. ఇతను తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వునేను సినిమా ద్వారా హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికంటే ముందు సునీల్ ఓ సినిమాలో నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి చిత్రంలో విద్యార్థుల గుంపులో ఒకరిగా కనిపిస్తారు.

నిఖిల్Nikhilయువ హీరో నిఖిల్ హ్యాపీడేస్ చిత్రం ద్వారా పాపులర్ అయ్యారు. ఈ చిత్రం కంటే ముందు నితిన్ సినిమా సంబరం లో ఓ కుర్రోడిగా కనిపిస్తారు. ఏంటి కనిపించలేదా? ఈసారి సంబరం సినిమాని చూడండి. మీరే గుర్తుపడతారు.

అనసూయ Anasuyaజబర్దస్త్ షో ద్వారా హాట్ యాంకర్ గా పేరుతెచ్చుకోవడంతో పాటు సోగ్గాడే చిన్ని నాయన, క్షణం చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి శెభాష్ అనిపించుకున్నారు. ఈమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ నాగ చిత్రంలో విద్యార్థుల్లో ఒకరిగా నటించింది. అప్పుడు ఆమెకు ఒక క్లోజప్ షాట్ కూడా లేదు.

రష్మీ Rashmiబుల్లి తెర, వెండితెర అని తేడా లేకుండా అందాలు ఆరబోసి యువకులకు నిద్ర లేకుండా చేస్తున్న బ్యూటీ రష్మీ. ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న ఈమె ఉదయ్ కిరణ్ మూవీ హోలీలో హాస్యనటుడు సునీల్ కి గర్ల్ ఫ్రెండ్ గా నటించింది.

సాయి రామ్ శంకర్ Sai ram Shankarప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ 143 మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే అతని గురించి అందరికీ తెలిసింది. అంతకంటే ముందు అతను ఇడియట్ మూవీలో రవితేజ మిత్ర బృందంలో ఒకరిగా నటించారు.

మాధవీ లతMadhavi Latha“నచ్చావులే” చిత్రం తో మాధవీలత హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కథానాయికగా కనిపించకముందు ఈమె హీరోయిన్ ఫ్రెండ్ రోల్ పోషించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అతిధి మూవీలో హీరోయిన్ కి స్నేహితురాలిగా చిన్న రోల్ చేసింది.

విజయ్ దేవరకొండVijaya Devarakondaపెళ్లిచూపులు మూవీతో సక్సస్ ఫుల్ హీరోగా పేరుతెచ్చుకున్న విజయ్ దేవరకొండ అంతకు ముందు చిన్న పాత్రలో వెండితెరపై కనిపించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు.

రావు రమేష్ Rao Rameshవిలక్షణమైన డైలాగ్ డెలివిరీతో అదరగొడుతున్న రావు రమేష్ సినీ పయనం అతి చిన్న పాత్రతోనే మొదలయింది. గమ్యంలో చేసిన నక్సలైట్ పాత్రతో లైమ్ లైట్ లోకి వచ్చిన రావు గోపాల్ రావు తనయుడు నటసింహ నందమూరి బాలకృష్ణ సీమ సింహం సినిమాలో సిమ్రాన్ కి తమ్ముడిగా నటించారు.

సిద్దార్ధ్ Siddarthలవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్దార్ధ్ ఆర్టిస్ట్ గా మారక ముందు దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆ సమయంలో అమృత సినిమాలో సాధారణమైన బస్సు ప్రయాణికుడిగా నటించారు. సినిమాలో అతను కొన్ని క్షణాలు మాత్రమే కనిపిస్తారు.

సంపూర్ణేష్ బాబు Sampoornesh Babuహృదయ కాలేయం అనే ఒక్క సినిమాతో బర్నింగ్ స్టార్ అయిపోయిన నటుడు సంపూర్ణేష్ బాబు. ఇతను కృష్ణవంశీ రూపొందించిన మహాత్మా చిత్రంలో రాజకీయ నాయకుడిగా నటించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya in Naaga Movie
  • #Madhavi Latha in Athidi Movie
  • #Nikhil in Sambaram Movie
  • #Rao Ramesh in Seema Simham Movie
  • #Rashmi in Holi Movie

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

16 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

18 hours ago

latest news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

13 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

1 day ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version