సినిమా విజయం సాధించినప్పుడు రాని ప్రశ్నలు.. ఇబ్బందికర ఫలితం వచ్చినప్పుడు వస్తాయి. అయితే ఆ సమస్యలు హిట్ అయిన సినిమాలో ఉండవా? అంటే కచ్చితంగా ఉంటాయనే చెప్పాలి. అయితే ఇక్కడ ఫలితంలో మార్పు ఒక్కటే కారణం. అంటే ఫలితం తేడాకొట్టేసరికి చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవుతాయి. అలా తెలిసినప్పుడు వాటిని సరిదిద్దుకోకపోతే మొత్తంగా ఆ సినిమా టీమ్ మొత్తానికి ఇబ్బంది. ముఖ్యంగా దర్శకుడికి ఇబ్బంది. ఎందుకంటే డైరక్టర్‌కి ఏ హీరో అయినా ఓకే చెప్పడానికి గత సినిమా ఫలితాన్ని గీటురాయిగా చూస్తారు.
అందులోనూ గత సినిమా స్టార్ హీరోతో చేసి ఉంటే.. కచ్చితంగా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఇదంతా తెలిసి కూడా ఓ స్టార్ దర్శకుడు తన కథల విషయంలో ఏ మాత్రం ఆలోచనలు మార్చుకోవడం లేదు. ఆయనే మురుగదాస్(A.R. Murugadoss) . ఆయన గత సినిమాలు చూస్తే ఎవరికైనా ఇదే మాట అనిపిస్తుంది. కొన్ని సినిమాల ఫలితాల విషయంలో కాస్త ఫర్వాలేదనిపించినా.. ఆయన రైటింగ్, టేకింగ్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ఆయన ట్రాక్ రికార్డు వల్ల పెద్ద హీరోలు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. మురుగదాస్ నిరాశపరుస్తూనే ఉన్నారు.
దీనికి కారణం ఏంటా అని చూస్తే.. ఆయన కథలే అని అర్థమవుతోంది. ‘కత్తి’ (Kaththi) సినిమా తర్వాత చూస్తే ఆయన ఎంచుకున్న కథలు దాదాపు నిరాశపరిచేవే. హీరోయిజం ఎలివేట్ చేసే కథల్లా లేకపోవడం, గట్టిపట్టు లేకపోవడం సమస్యలు అని చెప్పొచ్చు. కొన్ని మంచి కథలను సైతం ఆయన సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. ‘మౌనగురు’ను ‘అకిరా’గా బాలీవుడ్‌లో తీసి ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత మహేష్ బాబు(Mahesh Babu) ‘స్పైడర్’ (Spyder) గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఆ తర్వాత విజయ్ (Vijay Thalapathy) ‘సర్కార్’ (Sarkar) బాగుందనిపించినా.. మురుగదాస్‌కి మంచి పేరు అయితే రాలేదు.
రజనీకాంత్‌తో (Rajinikanth) చేసిన ‘దర్బార్’ (Darbar) సినిమా పార్ట్స్ అండ్ పీసెస్‌గా బాగుంటుంది అంతే. హోల్ ప్యాకేజీని సిద్ధం చేయడంలో మరుగదాస్ ఇబ్బందిపడ్డారు. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)‘సికందర్’(Sikandar) కూడా అదే సమస్య. లైన్ బాగున్నా కథ బాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా (Sikandar) ఫలితం కేవలం ఆయనకే కాదు.. మొత్తం సౌత్ సినిమాకు ఓ పాఠం అని చెప్పొచ్చు. పెద్ద హీరో ఛాన్స్ ఇచ్చారని కథ బాగోలేకుండా సర్దేద్దాం అని చూస్తే కెరీకే ఇబ్బందుల్లోకి వెళ్తుంది. కాబట్టి మురుగదాస్ నెక్స్ట్ ఆలోచిస్తారా లేదా అనేది చూడాలి. లేదంటే ఆగిపోవాల్సి వస్తుంది.