నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) -బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో రూపొందిన మొదటి చిత్రం ‘సింహా (Simha)’. దాదాపు 6 ఏళ్ళ పాటు హిట్టు లేకుండా గడిపాడు బాలయ్య. ఇంకో రకంగా ‘బాలయ్య పని ఇక అయిపోయింది’ అనే కామెంట్స్ కూడా వినిపించాయి.! ఆయన సినిమాలకి ఓపెనింగ్స్ కూడా రానంత ఘోరమైన పరిస్థితి ఉండేది. అలాంటి టైంలో ‘సింహా’ అనే మూవీ వచ్చింది. రిలీజ్ కి ముందు ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు లేవు.
కానీ 2010 ఏప్రిల్ 30న రిలీజ్ అయిన ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది ‘సింహా’. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 14 ఏళ్ళు కావస్తున్న నేపథ్యంలో ఒకసారి ఫైనల్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.10 cr |
సీడెడ్ | 7.70 cr |
ఉత్తరాంధ్ర | 3.43 cr |
ఈస్ట్ | 1.69 cr |
వెస్ట్ | 1.76 cr |
గుంటూరు | 3.70 cr |
కృష్ణా | 1.99 cr |
నెల్లూరు | 1.44 cr |
ఏపీ+తెలంగాణ(టోటల్) | 28.81 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.83 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 31.64 cr |
‘సింహా’ చిత్రం రూ.18.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో రూ.31.64 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొత్తంగా రూ.12.94 కోట్ల లాభాలను బయ్యర్స్ కి అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘సింహా’.