పెద్ద డిస్కషన్ కి దారి తీసిన దేవి శ్రీ కామెంట్స్!
- January 31, 2025 / 03:48 PM ISTByPhani Kumar
‘తండేల్’ (Thandel) సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రూపొందించిన సినిమా కావడంతో ఏకకాలంలో తమిళంలో కూడా విడుదల చేయాలని టీం డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో చెన్నైలో నిన్న ఓ ప్రమోషనల్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్పీచ్ ఇస్తూ ఓ కొత్త డిస్కషన్ కి తెరలేపాడు. ఇక ఈ వేడుకలో దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మాట్లాడుతూ అందరిలానే ముందుగా సాయి పల్లవిని (Sai Pallavi) మోసేసాడు.
Kadal, Thandel

ఏకంగా ‘స్టార్ డైరెక్టర్ మణిరత్నమే (Mani Ratnam) సాయి పల్లవికి వీరాభిమాని’ అంటూ చెప్పి అందరిలో ఉత్సాహం నింపాడు. అలాగే ‘తండేల్’ కథ మొదట అతనికి చెప్పినప్పుడు.. మణిరత్నం తెరకెక్కించిన ‘కడల్’ గుర్తుకొచ్చిందట. దేవి ఇలా అనడంతో అంతా ఇది ‘కడల్’ స్ఫూర్తితో రూపొందిందా? అని అంతా అనుకుంటున్నారు. కానీ దానికి దీనికి సంబంధమే ఉండదు. ‘కడల్’ సినిమాలో హీరో మత్స్యకారుడు. కానీ అందులో క్రిస్టియానిటీ, అలాగే బైబిల్ లోని కొన్ని పాత్రలు, అందులోని థీమ్ .. వీటన్నిటినీ బేస్ చేసుకుని దర్శకుడు మణిరత్నం ఆ కథని డిజైన్ చేశాడు.
అది కూడా ప్రేమకథ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ‘తండేల్’ కథ పూర్తిగా వేరు. శ్రీకాకుళంలో జరిగిన ఓ యదార్థ సంఘటనని ఆధారం చేసుకుని దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) ఈ చిత్రాన్ని తీశాడు. పాకిస్తాన్ సైనికులకు దొరికిపోయిన 20 మంది మత్స్యకారులు.. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చివరికి ఎలా బయటపడ్డారు అనేది.. ‘తండేల్’ కథ.కానీ ఇందులో కూడా లవ్ స్టోరీ హైలెట్ అవుతుంది అని ప్రతి సందర్భంలోనూ టీం గుర్తు చేస్తూనే ఉంది.












