సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతూ… నిన్న కిమ్స్ హాస్పిటల్ లో మరణించారు.ఆయన టాలీవుడ్లో స్టార్ రైటర్. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆయన పాటల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అక్షరాల్లో తెలియని పవర్ ఉంటుంది. అందుకోసమే ఆయనతో ఒక్క పాటనైనా రాయించుకోవాలని దర్శకనిర్మాతలు ఎగబడుతుంటారు. ఇందులో త్రివిక్రమ్ ముందుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలే బంధువు కాబట్టి.. ఓ వేదికలో సిరివెన్నెల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వర్ణించారు త్రివిక్రమ్.
‘అతను అర్ధరాత్రి మేల్కొనే సూర్యుడు. జవాబుదొరకని ఎన్నో ప్రశ్నల్ని తన పాటల ద్వారా మనముందుంచుతాడు.’ అంటూ చెప్పి చివర్లో ఆయన ఇంత గొప్ప సాహిత్యం రాయగల సమర్ధుడు.. అయినప్పటికీ అతను సినిమా కవి అవ్వడం వలన వెనక చైర్లో కూర్చిండిపోయాడు’ అంటూ చివర్లో కొన్ని పదాలు వాడాడు.ఈ స్పీచ్ కు డైహార్డ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఈ స్పీచ్ లో త్రివిక్రమ్.. అభిప్రాయాన్ని సమర్ధించను అని సిరివెన్నెల గారు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
‘నేను సినీ గేయ రచయిత అవ్వడం వలనే నా మనసులో ఉన్న అభిప్రాయాలను, భావాలను ఎంతో మందికి చేరవేయగలుగుతున్నానని, నా పై ఉన్న ప్రేమతో త్రివిక్రమ్ అలా మాట్లాడాడు… అతని అభిప్రాయాన్ని గౌరవిస్తాను కానీ ఏకీభవించను అంటూ ఓ సందర్భంలో తెలిపారు సిరివెన్నెల.