నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. సత్యదేవ్ జంగా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. హీరోయిన్లుగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటలు, టీజర్ రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కాగా ఈ చిత్రంలో స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఓ పాటకి సాహిత్యం అందించినట్టు చిత్ర యూనిట్ సభ్యులు ఆయన కాలం చేసిన రోజునాడు ప్రకటించారు.
‘సిరివెన్నెల’ అంటూ సాగే ఈ పాటని ఆయన అంత్యక్రియలు జరిగిన రోజున రికార్డ్ చేసినట్టు కూడా చిత్ర బృందం తెలిపింది. ఇక ‘సిరివెన్నెల చివరి సంతకం’ అంటూ శ్యామ్ సింగరాయ్ నుండీ విడుదలైన ఈ పాట…
‘నెల రాజుని.. ఇల రాణిని కనిపింది కదా సిరివెన్నెల
దూరమా దూరమా తీరమై చేరుమా
నడి రాతిరిలో తెరలు తెరిచినది
నది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా
కులుకు లొలుకు చెలి మొదటి కల
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తమ మువ్వలలో జనకు జనకు
సరికొత్త కళ’ .. అంటూ ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట సినిమాలో నాని, సాయి పల్లవి ల మధ్య చిగురించే లోతైన ప్రేమని తెలియజేస్తుంది. మీరు కూడా ఓసారి వినెయ్యండి :