యాక్టింగ్ నేర్పించరు.. కానీ నటినే కావాలనుకుంటున్నా!
- January 2, 2021 / 04:13 PM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని చిన్నతనం నుండే తన డాన్స్ లు, పాటలతో ప్రేక్షకులను అలరిస్తోంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి పలు వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. కొత్త ఏడాది సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ స్టార్ కిడ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. నాన్నే నా ఫేవరేట్ హీరో.. ఆయన సినిమాలు తప్ప ఇతర హీరోల సినిమాలు చూడనని చెప్పింది. వేరే హీరోల గురించి కూడా పెద్దగా తెలియదని అంది.
అయితే తన తండ్రి యాక్టింగ్ గురించి చెప్పరని, యాక్టింగ్ నేర్పించమంటే నేర్పించరని.. కానీ తను మాత్రం పెద్దయిన తరువాత సినీ తారను కావాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది సితార. తన సోదరుడు గౌతమ్ తో కలిసి నటించాలనుందని.. కానీ ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియదని అంది. ఆ అవకాశం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. గౌతమ్ ఇప్పటికే నాన్నతో కలిసి నటించాడని.. తనకు కూడా నాన్నతో కలిసి నటించాలనుందని తన కోరిక బయటపెట్టింది.

ఇక హీరోయిన్లలో రష్మిక అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పింది. రష్మిక తనతో చాలా ఫన్నీగా, చనువుగా అంటుందని.. బాగా మాట్లాడుతుందని ఆమెపై పొగడ్తల వర్షం కురిపించింది. మహేష్, నమ్రత లాంటి కుటుంబం ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తనకు ఇంత గుర్తింపు రావడానికి కారణమే తల్లితండ్రులే అని.. అందుకే దేవుడికి థాంక్స్ చెప్పుకొంటాను అంటూ వెల్లడించింది.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!















