మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా సుబ్బు డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. కరోనా కారణంగా చాలా సినిమాల షూటింగ్లు వాయిదా పడ్డాయి. అందులో ఇదొక్కటి. అయితే లాక్ డౌన్ తరువాత బ్యాలన్స్ షూటింగ్ ను చకా చకా పూర్తిచేసేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇదిలా ఉండగా.. ఒకానొక టైములో ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. అది కూడా ‘పే పెర్ వ్యూ’ ప్రకారం అని కూడా టాక్ వచ్చింది.
అయితే ఎవ్వరూ ఊహించని విధంగా.. ఇటీవల ఈ చిత్రం సెన్సార్ పనులు జరిగాయి. సెన్సార్ వారు కూడా ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా ‘యూ/ఎ’ సర్టిఫికెట్ ను జారీ చేశారు. సాధారణంగా ఓటిటిలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అవసరం లేదు. కానీ ఈ చిత్రానికి చేయించారు. కాబట్టి.. కచ్చితంగా దీనిని థియేటర్లలోనే విడుదల చేస్తారని డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ మధ్యనే థియేటర్లు ఓపెన్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకుని ఉండచ్చు కూడా..!
కానీ వారు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం థియేటర్లు తెరుచుకున్నప్పటికీ జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందులోనూ 50శాతం ఆకుపెన్సీ, సీట్ కు సీట్ కు మధ్య గ్యాప్ అంటున్నారు కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. అలా అయితే ఈ చిత్రాన్ని కొనుగోలు చేసే బయ్యర్స్ కు సగం పెట్టుబడి రావడం కూడా కష్టమనే చెప్పాలి. మరి తెలిసి తెలిసి మెగా హీరో సినిమాకి అంత రిస్క్ తీసుకుంటారా?