2009 లో వచ్చిన ‘అరుంధతి’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా రూ.30 కోట్లకి పైగా వసూళ్లు సాధించొచ్చు అని ప్రూవ్ చేసింది ఈ సినిమా. ఈ ఒక్క సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ అయిపోయింది. వరుస ఆఫర్లు అన్నీ ఆమెను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పటికీ అనుష్కకి భారీ డిమాండ్ ఉంది అంటే ‘అరుంధతి’ కూడా ఓ కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే ‘అరుంధతి’ సక్సెస్ కి అనుష్క మాత్రమే కాదు సోనూ సూద్ కూడా ప్రధాన కారణమని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో అఘోర పాత్రలో సోనూ నటన ది బెస్ట్ అనిపించుకుంది. పశుపతి అనే పాత్రకి మరెవ్వరూ న్యాయం చేయలేరు అన్నంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు సోనూసూద్. టెక్నాలజీ అంతంత మాత్రంగానే ఉన్న రోజుల్లో కూడా ‘అరుంధతి’ ని ఓ విజువల్ వండర్ గా ప్రజెంట్ చేశారు కోడి రామకృష్ణ. సోనూ సూద్ పాత్రను అతను డిజైన్ చేసిన తీరు కూడా అద్భుతమనే చెప్పాలి.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రం కోసం సోనూసూద్ ఎంత పారితోషికం అందుకుని ఉంటాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉండే ఉంటుంది. నిజానికి ‘అరుంధతి’ లో సోనూసూద్ కనిపించేది తక్కువసేపే. అయినప్పటికీ సినిమాని మొత్తం నడిపించేది ఆ పాత్రే అని చెప్పాలి. ఈ క్రమంలో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. సోనూసూద్ ను 20 రోజులు కాల్ షీట్లు ఇస్తే చాలు అని అడిగాడట. అందుకోసం రూ.18 లక్షలు పారితోషికం ఆఫర్ చేశాడట.
ఈ క్రమంలో (Sonu Sood) సోనూ సూద్ 20 లక్షలు ఇస్తే ఎన్ని రోజులైనా పని చేస్తాను అని చెప్పాడట. కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి 20 రోజులు సరిపోతాయి. ఒకవేళ వర్కింగ్ డేస్ పెరిగితే రోజుకు రూ.35 వేలు చెల్లిస్తానని చెప్పాడట. సోనూ ఇక మాట్లాడలేదు. కానీ అతని పార్ట్ అయితే 20 రోజుల్లో కంప్లీట్ అవ్వలేదు. చాలా లేట్ అయ్యింది. ఫైనల్ గా సోను ‘అరుంధతి’ కి రూ.45 లక్షలు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. ఇవి కూడా ఫ్లైట్ టికెట్స్,